Jun 27,2023 00:35

పరిశీలిస్తున్న కలెక్టర్‌ శివశంకర్‌

పల్నాడు జిల్లా కరస్పాండెంట్‌ : భారత ఎన్నికల సంఘం పల్నాడు జిల్లాకు కేటాయించిన ఈవిఎం, వివిపాడ్‌ లను భద్రపరచే కార్యక్రమాన్ని జిల్లా కలెక్టర్‌ కార్యాలయం చేపట్టింది. నరసరావుపేట పట్టణంలోని బస్టాండ్‌ ఎదురుగా ఉన్న వ్యవసాయ మార్కెటింగ్‌ శాఖకు చెందిన 7వ నంబరు గోదామును కేటాయించారు. బెంగళూరు బెల్‌ కంపెనీ నుంచి వచ్చిన 5920 వివి పాడ్‌లను కలెక్టర్‌, రెవిన్యూ, రాజకీయ ప్రతినిధుల సమక్షంలో స్వాధీనం చేసుకున్నారు. ప్రభుత్వం నిర్దేశించిన గోదాములో భద్రపరిచారు. అంతకు ముందు గోదాము వద్దకు కలెక్టర్‌ చేరుకొని పరిసర ప్రాంతాలను క్షుణ్ణంగా పరిశీలించారు. కలెక్టర్‌ పాటు జాయింట్‌ కలెక్టర్‌ ఎ.శ్యామ్‌ ప్రసాద్‌, జిల్లా రెవెన్యూ అధికారి వినాయకం, నరసరావుపేట రెవెన్యూ డివిజనల్‌ అధికారి శేషిరెడ్డి, తహశీల్దార్‌ రమణా నాయక్‌, కలెక్టరేట్‌ ఎస్‌.ఓ యశోద, వైసిపి ప్రతినిధి ఖాన్‌, సిపిఎం పల్నాడు జిల్లా కార్యదర్శి గుంటూరు విజరు కుమార్‌, బహుజన సమాజ్‌ పార్టీ బాబురావు తదితరులు పాల్గొన్నారు.