
రాయచోటి : ఈ నెల మూడో వారంలో జరిగే ఈవిఎంల ఫస్ట్ లెవెల్ చెక్ (ఎఫ్‌ఎల్‌సి) కార్యక్రమంలో అన్ని రాజకీయ పార్టీలు తప్పనిసరిగా పాల్గొనాలని కలెక్టర్ గిరీశ రాజకీయ పార్టీ ప్రతినిధులను కోరారు. శుక్రవారం కలెక్టరేట్లో రాజకీయ పార్టీ ప్రతినిధులతో కలెక్టర్ సమావేశం నిర్వహించారు. ఈ సంద ర్భంగా ఎఫ్‌ఎల్‌సి ప్రక్రియ విధానంపై పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా రాజ కీయ పార్టీలకు కలెక్టర్ వివరించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ ఈవిఎంల పనితీరుకు సంబంధించి ఎఫ్‌ఎల్‌సి చాలా ముఖ్యమైన అంశం సదరు కార్యక్రమం నిర్వహించే సమయంలో రాజకీయ పార్టీల భాగస్వామ్యం ఎంతో కీలకం కాబట్టి ఆయా పార్టీల ప్రతినిధులు తప్పనిసరిగా పాల్గొన్నాల్సి ఉంద న్నారు. ఎఫ్‌ఎల్‌సికి సంబంధించి ఎలక్షన్ కమిషన్ నుంచి షెడ్యూల్ రాగానే రాజ కీయ పార్టీలకు సమాచారం ఇస్తాం జిల్లాకు అందిన 3950 సియులు 4910 బియులు, 4850 వివి ప్యాట్‌లు మొత్తంగా 13710 ఈవిఎంల స్కాన్ ప్రక్రియ పూర్తి చేశామన్నారు. బియు, సియులకు యాక్సెప్టెన్సీ టెస్ట్ కూడా పూర్తి చేశామ న్నారు. 670 వివి ప్యాట్‌లకు యాక్సెప్టెన్సీ టెస్ట్ పూర్తయిందని మిగిలిన వాటి ప్రక్రియ కొనసాగుతోందని 11వ తేదీ లోపు పూర్తి చేస్తామన్నారు. రాజకీయ పార్టీ ప్రతినిధుల సమక్షంలో మాక్ పోల్ కూడా నిర్వహిస్తామని చెప్పారు. ఆ సందర్భంగా ఈవిఎంలకు సంబంధించి రాజకీయ పార్టీలకు ఏవైనా సందేహాలు ఉన్నా సంబంధిత బెల్ ఇంజనీరింగ్ అధికారులు నివత్తి చేస్తామన్నారు. జిల్లాలో నిర్వహించే ఎఫ్‌ఎల్‌సి విధానాన్ని వెబ్ కాస్టింగ్ ద్వారా ఎలక్షన్ కమిషన్ కూడా ప్రత్యక్షంగా పరిశీలిస్తుందని చెప్పారు. జిల్లాలో కొత్తగా 31 పోలింగ్ కేంద్రాలను ప్రతిపాదించామని, 88 పోలింగ్ స్టేషన్ల లొకేషన్ మార్పు, 92 పోలింగ్ స్టేషన్లకు పేరు మార్చుటకు, మెర్జింగ్ అండ్ డిలీషన్లో భాగంగా ఒక పోలీస్ స్టేషన్‌ను ఎలక్షన్ కమిషన్ కు ప్రతిపాదించినట్లు తెలిపారు. సమావేశంలో జాయింట్ కలెక్టర్ ఫర్మాన్ అహ్మద్‌ఖాన్, ఆర్‌డిఒలు రంగస్వామి, రామకృష్ణారెడ్డి, మురళి, హెచ్‌ఎన్‌ఎస్‌ఎస్ యూనిట్-1, యూనిట్-2 స్పెషల్ డిప్యూటీ కలెక్టర్లు, తహశీల్దార్లు, వివిధ రాజకీయ పార్టీ ప్రతినిధులు పాల్గొన్నారు.