Oct 18,2023 22:14

ఇవిఎంల ఎఫ్‌ఎల్‌సి ప్రక్రియ పరిశీలన

ఇవిఎంల ఎఫ్‌ఎల్‌సి ప్రక్రియ పరిశీలన
తిరుపతి టౌన్‌ : ఎన్నికల కమిషన్‌ సూచించిన నియమ నిబంధనలు మేరకు బి యు, సియులు, వివి ప్యాట్స్‌ ల ఫస్ట్‌ లెవెల్‌ చెకింగ్‌ జరుగుతున్న కార్యక్రమం బెల్‌ ఇంజనీర్లు అప్రమత్తతో పూర్తి చేయాలని కలెక్టర్‌ కె వెంకటరమణా రెడ్డి ఆదేశించారు. బుధవారం ఉదయం రేణిగుంట వద్ద వేర్‌ హౌసింగ్‌ కార్పోరేషన్‌ లో వున్న ఇవిఎం ల గోడౌన్‌ లో ఎఫ్‌.ఎల్‌.సి. ప్రక్రియ ను జిల్లా కలెక్టర్‌ పరిశీలించి పలు సూచనలు చేసారు. ఎఫ్‌.ఎల్‌.సి. ప్రక్రియకు బెల్‌ ఇంజనీర్లును కేటాయించిన మేరకు ఓటింగ్‌ యంత్రాల అనుసంధానం జరగాలని అన్నారు. ఇ ఎం ల నోడల్‌ అధికారి కోదండరామి రెడ్డి, రాజకీయ పార్టీల ప్రతినిధులు ఐ.ఎన్‌.సి. చిరంజీవి, తెలుగుదేశం మనోహరాచారి పాల్గొన్నారు.