May 22,2023 22:26

ఈవిఎంల గోదాములు పరిశీలించి రిజిస్టర్‌లో సంతకం చేస్తున్న కలెక్టర్‌ కృతికా శుక్లా


ప్రజాశక్తి - కాకినాడ
భారత ఎన్నికల సంఘం మార్గనిర్దేశాల మేరకు ఈవిఎం భద్రతకు పటిష్ట చర్యలు తీసుకోవాలని కలెక్టర్‌ కృతికా శుక్లా అధికారులను ఆదేశించారు. కాకినాడ కలెక్టరేట్‌ వద్ద ఉన్న ఈవిఎం, వివి ప్యాట్‌ రక్షణ, భద్రతపై గోదామును సోమవారం కలెక్టర్‌ కృతిక రెవెన్యూ, ఎన్నికలు, అగ్నిమాపక శాఖల అధికారులతో కలిసి తనిఖీ చేశారు. కలెక్టర్‌ కృతికా శుక్లా మాట్లాడుతూ ప్రతి నెల ఈవిఎం, వీవీ ప్యాట్‌ గోదామును తనిఖీ చేసి, సమగ్ర నివేదికను పంపిస్తున్నట్లు వెల్లడించారు. కాకినాడ ఆర్‌డిఒ బివి రమణ, పట్టణ తహశీల్దార్‌ సీతాపతి రావు, కాకినాడ పట్టణ ఎన్నికల డిప్యూటీ తహసీల్దార్‌ సీహెచ్‌ లక్ష్మీ ప్రసన్న పాల్గొన్నారు.