Oct 15,2023 00:29

 పల్నాడు జిల్లా: నరసరావుపేట, మార్కెట్‌ యార్డులోని ఎలక్షన్‌ సామాగ్రిని కలెక్టర్‌ ఎల్‌.శివశంకర్‌,జాయింట్‌ కలెక్టర్‌ ఎ.శ్యాం ప్రసాద్‌ లు శనివారం ఆకస్మిక తనిఖీ చేశారు. ఎలక్షన్‌ ఆఫీసర్‌ తరహాలో మార్కెట్‌ యార్డులోని ఇవిఎం, వివిప్యాట్‌ల తనిఖీ కేంద్రాన్ని తనిఖీ చేశారు. 2024 - ఎన్నికలు సమీపిస్తున్న వేళ ఎన్నికల అధికారులు అన్ని సామాగ్రిని సన్నద్ధం చేయాలని కలెక్టర్‌ ఆదేశించారు. కలెక్టర్‌ ఆదేశాల మేరకు గోడౌన్‌ నిర్వహణ అధికారి జాయింట్‌ కలెక్టర్‌, ట్రైనీ కలెక్టర్‌ కల్ప శ్రీ, డిఆర్‌ఓ వినాయకం, ప్రోటోకాల్‌ సిబ్బంది, ఎన్నికల నిర్వహణ అధికారులు పాల్గొన్నారు. ఇవిఎం, వివిప్యాట్‌లు సక్రమంగా సరిపడా ఉన్నాయో లేదో గమనించాలని సంబంధిత శాఖల అధికారులను ఆదేశించారు.