Jul 14,2023 20:50

ఇవిఎం గోడౌన్‌ను పరిశీలిస్తున్న కలెక్టర్‌ నిశాంత్‌కుమార్‌, ఎస్‌పి విక్రాంత్‌పాటిల్‌

ప్రజాశక్తి - పార్వతీపురం : ఈవిఎంలను భద్రపర్చిన గోడౌన్‌ను కలెక్టర్‌ నిశాంత్‌ కుమార్‌, ఎస్‌పి విక్రాంత్‌ పాటిల్‌ శుక్రవారం పరిశీలించారు. త్వరలో జరగబోయే సాధారణ ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని ఇవిఎం యంత్రాల స్థితిని పరిశీలించారు. గోడౌన్‌ దగ్గర పోలీసు బందోబస్త్‌ను, పరిసరాలను, గోడౌన్‌ లోపల సీలింగ్‌, గోడలను కలెక్టర్‌ పరిశీలించారు. ఈ సందర్బంగా కలెక్టర్‌ మాట్లాడుతూ కొత్తగా ఏర్పడిన జిల్లాలో త్వరలో జరగబోయే సాధారణ ఎన్నికలను పగడ్బందీగా నిర్వహించాల్సిన అవసరం ఉందని కలెక్టర్‌ తెలిపారు. ఎటువంటి ఇబ్బందులు రాకూడదని ముందుగానే ఇవిఎం యంత్రాలను సిద్ధం చేసుకోవాలని అధికారులకు సూచించారు. కార్యక్రమంలో జాయింట్‌ కలెక్టర్‌ ఆర్‌.గోవిందరావు, డిఆర్‌ఒ జె.వెంకటరావు, ఆర్‌డిఒ కె.హేమలత, తహశీల్దార్‌ శివన్నారాయణ, డిఎఫ్‌ఒ ప్రసూన తదితరులు పాల్గొన్నారు.