ప్రజాశక్తి - ఆదోని
ఆదోనిలో వివిధ రాజకీయ పార్టీలు, సినిమా, లాభాలు ఆర్జించే సంస్థలు, షాపు వ్యాపార ప్రకటన బ్యానర్లపై లేని ఆంక్షలు ప్రజా సమస్యలపై పోరాడే సిపిఎం బ్యానర్లపై ఎందుకని సిపిఎం పట్టణ కార్యదర్శి లక్ష్మన్న, కార్యదర్శి వర్గసభ్యులు గోపాల్, తిప్పన్న ప్రశ్నించారు. శనివారం ఆదోనిలోని సుందరయ్య భవన్‌లో ఏర్పాటు చేసిన సమావేశంలో వారు మాట్లాడారు. పట్టణంలో ఇతర బ్యానర్లు సుమారు 200 వరకు ఉన్నాయని, కేవలం ఈనెల 15న చలో విజయవాడకు సంబంధించిన కేవలం రెండు బ్యానర్లు మాత్రమే ఆటంకంగా ఉన్నాయని మున్సిపల్ (టౌన్ ప్లానింగ్) అధికారులు తొలగించడం విడ్డూరంగా ఉందన్నారు. మున్సిపల్ కమిషనర్ కేవలం సిపిఎంకు సంబంధించిన రెండు బ్యానర్లు మాత్రమే తొలగించమని టౌన్ ప్లానింగ్ అధికారులకు చెప్పి ఉండరని తాము భావిస్తున్నామని తెలిపారు.
సమావేశంలో మాట్లాడుతున్న నాయకులు