Dec 04,2022 22:41

ప్రజాశక్తి-జగ్గయ్యపేట

స్విమ్మింగ్‌ ఫెడరేషన్‌ ఆఫ్‌ ఇండియా ఆదివారం విజయవాడలో నిర్వహించిన ఈత పోటీల్లో జగ్గయ్యపేట డ్రీమర్స్‌ విన్నర్స్‌ అసోసియేషన్‌ బాలలు విశేష ప్రతిభ ప్రదర్శించారు. ఇరువురు ఇంటర్‌ డిస్టిక్స్‌ ఛాంపియన్షిప్‌ పోటీలకు ఎంపికయ్యారు. విజయవాడ లోని సర్‌ విజ్జి స్విమ్మింగ్‌ పూల్‌ లో 1, 2, 3 గ్రూప్స్‌ నందు 10 నుండి 17 సంవత్సరాల వయసు గల బాల, బాలికలకు నిర్వహించిన ఈత పోటీలలో జగ్గయ్యపేట డ్రీమర్స్‌ స్విమ్మర్స్‌ అసోసియేషన్‌ టీం మేనేజర్‌ అన్నంనేని కళ్యాణ్‌, కోచ్‌ పొట్టాబత్తిన సందీప్‌ ఆధ్వర్యంలో బాలబాలికలు టి యం చరణ్‌ తేజ, డి రోమన సఫీరా, ఏ. తనిష్క, బి. భవ్య సాయిశ్రీ పోటీలలో పాల్గొన్నారు. వీరిలో టీఎం. చరణ్‌ తేజ, ఏ. తనుష్క ఈనెల10,11 తేదీ ఏలూరులో జరిగే 7 వ ఇంటర్‌ డిస్టిక్స్‌ ఛాంపియన్షిప్‌ పోటీలకు సెలెక్ట్‌ అయ్యారు. ఈ పోటీల్లో కూడా విజయం సాధించిన వారు త్రివేండ్రంలో జరిగే ఆల్‌ ఇండియా పోటీలకు అర్హత పొందుతారని టీం మేనేజర్‌ అన్నంనేని కళ్యాణ్‌, కోచ్‌ పొట్టాబత్తిన సందీప్‌ తెలిపారు. ప్రతిభ ప్రదర్శించినబాలలను డ్రీమర్స్‌ అసోసియేషన్‌ అధ్య క్షులు మందడపు శ్రీనివాసరావు, ప్రధాన కార్యదర్శి కలాలి నరేష్‌ కోచ్‌ దంపతులు పొట్టాబత్తిన పాండు రంగారావు, లక్ష్మి తదితర సీనియర్‌ స్విమ్మర్స్‌ అభినందించారు.