Oct 07,2023 11:44

ఇజ్రాయిల్, హమాస్ మధ్య ఉద్రిక్తత నెలకొంది. ఇజ్రాయిల్ పై హమాస్ రాకెట్ల దాడి చేసినట్లు ఇజ్రాయిల్ సైన్యం పేర్కొంది. హమాస్ చొరబాటు దాడిలో ఇజ్రాయిల్ పౌరులు మృతి చెందినట్లు తెలిపారు. దీంతో గాజా సరిహద్దు 80 కిలోమీటర్ల దూరంలో ఎమర్జెన్సీని ఇజ్రాయిల్ ప్రకటించింది. ఈ దాడులకు హమాస్ మూల్యం చెల్లించుకుంటుంది అని ఇజ్రాయిల్ సైన్యం ప్రకటించింది.