Apr 10,2023 15:53

ప్రజాశక్తి-పాడేరు : ఐటిడిఏకు ఐఎస్ఓ 9001 - 2015 ఉత్త‌మ‌ పుర‌ష్కారం ల‌భించింది.   జిల్లా క‌లెక్ట‌ర్  సుమిత్ కుమార్‌, ఐటిడిఏ  పి ఓ రోణంకి గోపాల క్రిష్ణ సోమ‌వారం క‌లెక్ట‌ర్ చాంబ‌ర్‌లో ఐ ఎస్ ఓ స‌ర్టిఫికేట్‌ను సంస్థ ఎం.డి. శివ‌య్య చేతుల మీద‌గా  స్వీక‌రించారు. కార్యాల‌యం నిర్వ‌హ‌ణ‌లో నాణ్య‌త‌లు పాటించ‌డం, గిరిజ‌నాభివృధ్ధి, ఉత్త‌మ వైద్య సేవ‌లు, విద్యా ప్ర‌మాణాలు, మెరుగైన జీవ‌న‌నోపాదులు క‌ల్ప‌న‌, గృహ నిర్మాణాలు, విద్యుదీక‌ర‌ణ‌, తాగునీటి సౌక‌ర్యాల క‌ల్ప‌న వంటి రంగాల‌లో పాటిస్తున్న నాణ్య‌తా ప్ర‌మాణాల‌ను  ప‌రిశీలించి సంతృప్తి చెంద‌న త‌రువాత హెచ్ వైఎం  ఇంట‌ర్నేష‌న‌ల్ స‌ర్టిఫికేష‌న్ ప్రైవేట్ లిమిటెడ్ సంస్థ   ఐ ఎస్ ఓ స‌ర్టిఫికేష‌న్ జారీ చేసింది. గ‌తంలో గిరిజ‌న సహ‌కారం సంస్థ‌, గిరిజ‌న సంక్షేమ శాఖ‌కు ఐ ఎస్ ఓ స‌ర్టిఫికేష‌న్ జారీ చేసామ‌ని   ఐ ఎస్ ఓ  ఎం.డి. శివ‌య్య తెలియ జేసారు. రెండు తెలుగు రాష్టాల‌లో పాడేరు ఐటిడిఏ కు   ఐ ఎస్ ఓ స‌ర్టిఫికేట్ ల‌భించింద‌న్నారు. అన్ని ర‌కాల నాణ్య‌తా ప్ర‌మాణాలు ఆడిట్ చేసిన త‌రువాత ఐఎస్ఓ స‌ర్టిఫికేట్ ఇస్తామ‌ని పేర్కొన్నారు. ఈ కార్య‌క్ర‌మంలో ఐటిడిఏ స‌హాయ ప్రాజెక్టు అధికారులు వి ఎస్ ప్ర‌భాక‌ర రావు,  ఎం.వేంక‌టేశ్వ‌ర‌రావు, గిరిజ‌న సంక్షేమ శాఖ ఉప సంచాల‌కులు ఐ.కొండ‌లరావు,  ఇఇ, డి.వి. ఆర్.ఎం. రాజు, ప‌రిపాల‌నాధికారి హేమ‌ల‌త‌, డిఇ ఇ  అనుదీప్ త‌దిత‌రులు పాల్గొన్నారు.