ఈశ్వరమ్మకు డాక్టరేట్
ఈశ్వరమ్మకు డాక్టరేట్
ప్రజాశక్తి - క్యాంపస్ :శ్రీ పద్మావతి మహిళా విశ్వ విద్యాలయం పరిశోధకురాలు కె.ఈశ్వరమ్మ కు డాక్టరేట్‌ను ప్రదానం చేసినట్లు పరీక్షల నియంత్రణ విభాగ కార్యాలయం ఒక ప్రకటనలో తెలిపారు. జర్నలిజం విభాగంలోని ఆచార్య ఎన్.వి రమణమ్మ పర్యవేక్షణలో ''పబ్లిక్ రిలేషన్స్ ఇన్ కార్పొరేట్ అండ్ గవర్నమెంట్ హాస్పిటల్స్:ఎ స్టడీ విత్ స్పెషల్ రిఫరెన్స్ టు చిత్తూరు జిల్లా'' అనే అంశంపై పరిశోధనా గ్రంధాన్ని వర్సిటీకి సమర్పించినట్లు వెల్లడించారు. ఆమె పలు జాతీయ, అంతర్జాతీయ పరిశోధన జర్నల్స్‌లలో అనేక పరిశోధన పత్రాలను ప్రచురించినట్లు వెల్లడిం చారు. ఈశ్వరమ్మకు డాక్టరేట్ డిగ్రీ అవార్డు రావడం పట్ల పలువురు ఆచార్యులు, పరిశోధకులు, బంధుమిత్రులు అభినందనలు తెలిపారు.










