Oct 11,2023 23:35

ఇసుక ట్రాక్టర్లు సీజ్‌

ఇసుక ట్రాక్టర్లు సీజ్‌
ప్రజాశక్తి -పెళ్లకూరు: పెళ్లకూరు మండ లంలోని కలవకూరు వద్ద బుధవారం తెల్లవారు జామున ఎలాంటి అనుమ తులు లేకుండా ఇసుకను తరలిస్తున్న రెండు ట్రాక్టర్లను ఎస్‌ఈబి అధికారు లు అదుపులోకి తీసుకున్నారు. తిరుపతి జిల్లా ఎస్‌పి పరమేశ్వర్‌ రెడ్డి, అడిషనల్‌ ఎస్‌పి రాజేంద్ర ఆదేశాల మేరకు పుల్లూరు నుంచి నిరంతరం ఇసుక తరలింపును అడ్డుకోవాలని గస్తీ నిర్వహించి కలవకూరు గ్రామానికి చెందిన దగ్గు మాటి రమేష్‌, నెలబల్లి శంకరయ్య ఎలాంటి అనుమతులు లేకుండా ఒక్కొక్కరు సుమారు నాలుగు టన్నుల ఇసుకను ట్రాక్టర్ల ద్వారా తరలిస్తుండగా సబ్‌ అధికారులు దాడులు చేసి పట్టుకున్నట్లు ఎస్‌ఈబి ఇన్‌స్పెక్టర్‌ ఆర్‌ యువిఎస్‌ ప్రసాద్‌ తెలిపారు. ఈ దాడుల్లో వారి వెంట కానిస్టేబుల్‌ పి వెంకటేశ్వర్లు, రమణయ్య, రాజయ్య, డి వెంకటేశ్వర్లు, సుబ్బయ్య, తదితరులు పాల్గొన్నా రు. పట్టుకున్న ఇసుక ట్రాక్టర్లను ఎస్‌సిబి స్టేషన్‌ కు తరలించారు. కేసు దర్యాప్తు చేస్తున్నారు.