Aug 23,2023 20:13

సీజ్‌ చేసిన ట్రాక్టర్లు

ప్రజాశక్తి - లింగసముద్రం : మండలంలోని అన్నేబోయినపల్లి మన్నేరు నుంచి అక్రమంగా ఇసుకను తరలిస్తున్న తొమ్మిది ట్రాక్టర్లను సెబ్‌ ఎస్‌ఐ డి.మౌలాలి బుధవారం తెల్లవారు జామున అదుపులోకి తీసుకుని పోలీస్టేషన్‌కు తరలించారు. కందుకూరు సెబ్‌ సిఐ డి.వెంకటేశ్వర్లుకు వచ్చిన సమాచారం మేరకు మన్నేరుకు రావడంతో అక్కడ ఇసుకను రవాణా చేస్తున్న ట్రాక్టర్లను, తొమ్మిది మంది డ్రైవర్లను అద ుపులోకి తీసుకున్నారు.సెబ్‌ సిఐ ఇచ్చిన స్పెషల్‌ రిపోర్టు మేరకు లింగసముద్రం ఎస్‌ఐ ఎం.బాజిబాబు ట్రాక్టర్‌ డ్రైవర్ల పై కేసు నమోదు చేశారు.