సీజ్ చేసిన ఇసుక ట్రాక్టర్లు
ప్రజాశక్తి - లింగసముద్రం :మండలంలోని విఆర్ కోట వద్దనున్న మన్నేరు నుంచి అనుమతులు లేకుండా అక్రమంగా ఇసుకను తరలిస్తున్న మూడు ట్రాక్టర్లను సెబ్ ఎస్‌ఐ మౌలాలి సోమవారం ఉదయం అదుపులోకి తీసుకుని పోలీస్‌స్టేషన్‌కు తరలించారు. కందుకూరు సెబ్ సిఐ డి.వెంకటేశ్వర్లు ఆదేశాల మేరకు విఆర్ కోట సమీపంలో మూడు ట్రాక్టర్లను,డ్రైవర్లను అదుపులోకి తీసుకొని లింగసముద్రం పోలీస్‌స్టేషన్‌లో అప్పగించారు. పట్టపగలే ఇసుకను యథేచ్ఛగా అక్రమంగా తరలిస్తుడటంతో గ్రామస్తులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.సెబ్ ఎస్‌ఐ ఇచ్చిన స్పెషల్ రిపోరుట మేరకు ట్రాక్టర్ల డ్రైవర్లపై కేసు నమోదు చేసినట్లు స్టేషన్ హౌస్ ఆఫీసర్ ఎ.మల్లిఖార్జున తెలిపారు.










