ప్రజాశక్తి - నందవరం
తుంగభద్ర నది నుంచి అక్రమంగా ఇసుక తరలిస్తున్న 8 ట్రాక్టర్లను నందవరం పోలీసులు పట్టుకున్నారు. గతవారం రోజులుగా రాత్రి పూట గురజాల గ్రామ సమీపంలోని తుంగభద్ర నదిలో జెసిబితో అక్రమంగా ఇసుకగా తరలిస్తున్నారు. బుధవారం ఉదయం 5 గంటలకే ఎస్‌ఐ మహేష్ కుమార్ తన సిబ్బందితో గురజాల గ్రామానికి వెళ్లి 8 ట్రాక్టర్లను పట్టుకొని పోలీసు స్టేషన్‌కు తరలించారు. ట్రాక్టర్ యజమానులైన మెడికొండ గ్రామానికి చెందిన బోయ పెద్ద రాముడు, పులికల్లు గ్రామానికి చెందిన బోయ కొతింటి శ్రీనివాసులు, నాగేంద్ర, పరంపోగు నరసింహుడు, కొతింటి బోయ చిన్న హనుమంతు, బోయ హరికృష్ణ, కురువ ఎల్లప్ప, గంట బడే సాబ్‌పై కేసు నమోదు చేశామని ఎస్‌ఐ మహేష్ కుమార్ తెలిపారు. ఎవరైనా ప్రభుత్వ అనుమతి లేకుండా ఇసుకను తరలిస్తే కేసులు నమోదు చేసి జైలుకు పంపుతామని హెచ్చరించారు.
పోలీసు స్టేషన్ ఆవరణలో ఉన్న ట్రాక్టర్లు










