
ప్రజాశక్తి - చీరాల
మండలంలోని కావూరివారిపాలెం రైతుల పొలాల్లో అక్రమంగా ఇసుక తవ్వి తరలిస్తున్న లారీలను సిపిఎం సహకారంతో రైతులు గురువారం అడ్డుకున్నారు. గత కొద్దిరోజులుగా రైతుల భూముల్లో అనుమతులు లేకుండా ఇసుక తవ్వకాలపై గ్రామస్థులు కలెక్టర్‌కు ఫిర్యాదు చేశారు. కలెక్టర్ ఆదేశాలతో అక్రమ తవ్వకాలపై అధికారులు సర్వే చేశారు. ఐదు వేల క్యూబిక్ మీటర్ల మెరక తవ్వకునేందుకు అనుమతి తీసుకుని 2లక్షల క్యూబిక్ మీటర్లు తవ్వేసినట్లు అధికారులు లెక్కలు తేల్చారు. ఈ క్రమంలో తవ్వకాలను అధికారులు నిలిపేశారు. అయితే గురువారం రాత్రి మళ్లీ తవ్వకాలు చేసి తరలిస్తున్న లారీలను కావూరివారిపాలెం గ్రామంలో గ్రాస్థులు అడ్డుకున్నారు.