Aug 29,2023 00:15

కలిగొట్ల ఇసుక రీచ్‌ వద్ద సత్యాగ్రహ దీక్ష చేస్తున్న టిడిపి నేతలు, కార్యకర్తలు

ప్రజాశక్తి-దేవరాపల్లి
వైసిపి ఇసుక దోపిడీకి వ్యతిరేకంగా టిడిపి అధిష్టానం పిలుపు మేరకు మండలంలోని కలిగొట్ల శారదా నది వంతెన సమీపంలోని ఇసుక రీచ్‌ వద్ద సోమవారం ఆ పార్టీ నాయకులు, కార్యకర్తలు ఇసుక సత్యాగ్రహం కార్యక్రమం చేపట్టారు. వైసీపీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా పెద్ద పెట్టున నినాదాలు చేశారు. టిడిపి మాడుగుల నియోజకవర్గం ఇన్‌ఛార్జి పివిజి.కుమార్‌ అధ్యక్షతన జరిగిన ఈ నిరసన కార్యక్రమంలో మాజీ మంత్రి బండారు సత్యనారాయణమూర్తి ఉప ముఖ్యమంత్రి బూడి ముత్యాలనాయుడు ఇసుకను తన ఆధీనంలో పెట్టుకొని అడ్డగోలుగా దోచుకుంటున్నారని ఆరోపించారు. వైసిపి ఇసుక దోపిడీని అధికారి యంత్రాంగం ఆపలేకపోతే, టిడిపి కార్యకర్తలు అక్రమ ఇసుక రవాణాను అడ్డుకుంటారని హెచ్చరించారు. టిడిపి జిల్లా అధ్యక్షులు బుద్ధ నాగ జగదీశ్వరరావు మాట్లాడుతూ ఇసుకను అక్రమంగా తరలిస్తున్నా పట్టించుకోని స్థానిక తహసీల్దార్‌ను తక్షణమే సస్పెండ్‌ చేయాలని డిమాండ్‌ చేశారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్సీ దువ్వారపు రామారావు, మాజీ ఎమ్మెల్యేలు గవిరెడ్డి రామానాయుడు, కోళ్ల లలితా కుమారి, గిడ్డి ఈశ్వరి, పల్లా శ్రీనివాసరావు, టిడిపి నాయకులు కోరాడ రాజబాబు, బత్తుల తాతయ్య బాబు, లొడగల కృష్ణ, పైలా ప్రసాదరావు, కృష్ణ యాదవ్‌, సత్యవతి, పోతల పాత్రు నాయుడు, చరకాన సూర్యనారాయణ, దొగ్గ దేముడు నాయుడు, బండారు రామారావు, చల్లా నానాజీ, అధిక సంఖ్యలో కార్యకర్తలు పాల్గొన్నారు.