పోలీసు స్టేషన్లలో వినతిపత్రం ఇస్తున్న జనసేన కార్యకర్తలు
ప్రజాశక్తి-కొల్లూరు: కొల్లూరు మండల పరిధిలోని ఇసుక రీచ్‌లో అక్రమంగా తవ్వకాలతో దొంగిలిస్తున్న ఇసుక దొంగలను అరికట్టాలని జనసేన పార్టీ జిల్లా కార్యదర్శి సోము రౌతు అనురాధ, ఇతర నాయకులు కొల్లూరు, వేమూరు పోలీస్ స్టేషన్లలో సోమవారం వినతిపత్రం అందించారు. ఈ సందర్భంగా జనసేన పార్టీ జిల్లా కార్యదర్శి సోము రౌతు అనురాధ మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం అక్రమాలు చేస్తున్న ఇసుక పాలసీలో భాగంగా జై ప్రకాష్ పవర్ లిమిటెడ్ వారితో ఒప్పందం ఈ నెల రెండో తేదీతో పూర్తయిందని సంబంధిత అధికారులు ఇసుకను తవ్వకాలు నిలుపుదల చేయాలని జయ ప్రకాష్ వెంచర్స్ వారికి నోటీసులు ఇచ్చారు. అయినా వారిలో స్పందన లేదని, ఇసుక తవ్వకాలు జెసిబితో విపరీతంగా జరిపి ఇతర ప్రాంతాలకు తరలిస్తున్నారని వారు పేర్కొన్నారు.










