వినతిపత్రం సమర్పిస్తున్న జనసేన నాయకులు
ఇసుక అవినీతి గురించి ప్రశ్నిస్తే అక్రమ కేసులా...
ప్రజాశక్తి-నెల్లూరు:సుప్రీంకోర్టు ఆదేశాల ప్రకారం రాష్ట్రంలోనే 110 ఇసుక రీచులను తవ్వకం నిలిపివేయాల్సి ఉండగా... మినగల్లు గ్రామంలోని భారీ యంత్రాలతో నది నుంచి దారి వేసుకొని 40 అడుగుల మీద అక్రమ తవ్వకాలని జనసేన పార్టీ తరఫున ప్రశ్నించినందుకు గాను జనసేన నాయకులు మీద కేసులు కట్టిన కట్టడాన్ని నిరసిస్తూ ఆ కేసులు వెనక్కి తీసుకోవాలంటూ జనసేన ఆధ్వర్యంలో ఛలో కలెక్టరేట్ కార్యక్రమం నిర్వహించారు. సోమవారం నగరంలోని గాంధీ బొమ్మ నుండి కలెక్టరేట్ వరకు ర్యాలీ నిర్వహించి, అనంతరం కలెక్టర్‌ను కలిసిన జనసేన నాయకులు ఇసుక అక్రమ తవ్వకాలు ఆపాలని సుప్రీంకోర్టు ఆదేశాలు అమలు చేయాలని, ఈ అక్రమాన్ని ప్రశ్నించింనందుకు తమపై అక్రమ కేసులు నమోదు చేయడం దారుణమని , వెంటనే ఆ కేసులను ఉపసంహరించుకోవాలని కోరారు. అనంతరం జనసేన నాయకులు గురుకుల కిషోర్ మీడియాతో మాట్లాడుతూ గ్రామస్తుల నోళ్లు నొక్కి.. అధికారుల కళ్ళు కప్పి.. సుప్రీంకోర్టు మాటలు చెవున పెట్టక...
దోచుకు తింటుందీ వైసిపి ప్రభుత్వం గ్రీన్ ట్రిబ్యునల్ సుప్రీంకోర్టు ఆదేశాల ప్రకారం రాష్ట్రంలోని 110 రీచ్ లలో భారీ యంత్రాలతో తవ్వరాదని తదుపరి తీర్పు వరకు వాటి నిలిపివేయాలని డిమాండ్ చేశారు. ఇష్టారీతిన ఇసుకను తవ్వి రాష్ట్రాన్ని దాటిస్తున్నారు....అక్రమంగా సంపాదించు కుంటున్నావారిపై కేసులు నమోదు చేయాలన్నారు. గ్రామానికి కనీసం నిధులు సమకూర్చక మౌలిక వసతులైన రోడ్లు,నీరు,వైద్యం కూడా కల్పించగా వైసిపి ప్రభుత్వం దోచుకుతింటుందన్నారు. ఇసుక రీచ్ లో దాదాపు పది ప్రొక్లైన్లు 30 లారీలు 100 మంది జనాభా ఉండగా మేము ఒక 20 మందిని వాళ్ళ మీద దౌర్జన్యం చేశామంటూ కేసులు పెట్టడం సమంజసం కాదన్నారు.అన్యాయాన్ని ప్రశ్నిస్తే అక్రమంగా కేసులు పెట్టడం అమానుషమన్నారు.దీనిని ఇంతటితో వదిలేదిలేదు గ్రీన్ ట్రిబ్యునల్ కోర్టుకు సుప్రీంకోర్టుకు వ్యతిరేకంగా చేస్తున్న రాష్ట్ర ప్రభుత్వం తీరుని ఎండగడతామన్నారు.మొన్న వరదలకి గ్రామ పులికట్టలు తెగి గ్రామాలు మునిగిపోతే కనీసం ఒక్క పూట భోజనం ప్యాకెట్ కూడా అందించలేని ఈ ప్రభుత్వం ఇలా దోచుకు పోతూంటే చూస్తూ ఊరుకుంటారా ప్రశ్నించారు.










