Aug 29,2023 22:09

సాలూరు తహశీల్దార్‌ కార్యాలయం వద్ద ధర్నా చేస్తున్న టిడిపి నాయకులు, కార్యకర్తలు

ప్రజాశక్తి - సాలూరు :   అధికారపార్టీ నాయకుల అండతో జరుగుతున్న ఇసుక మాఫియా అక్రమాలపై చర్యలు తీసుకోవాలని కోరుతూ టిడిపి నాయకులు కార్యకర్తలు మంగళవారం స్థానిక తహశీల్దార్‌ కార్యాలయం వద్ద ధర్నా నిర్వహించారు. నియోజకవర్గ ఇన్‌ఛార్జి సంధ్యారాణి, మాజీ ఎమ్మెల్యే ఆర్పీ భంజ్‌ దేవ్‌ ఆధ్వర్యాన మండల నాయకులు, కార్యకర్తలు నిరసన వ్యక్తం చేశారు. రాష్ట్రంలో ఇసుక మాఫియా ఆగడాలకు అడ్డూ అదుపూ లేకుండా పోయిందన్నారు. సిఎం జగన్‌ నివాసం పక్కనే ఇసుక దందా జరుగుతున్నా చర్యలు లేవని ఆరోపించారు. కార్యక్రమంలో పట్టణ పార్టీ అధ్యక్షుడు నిమ్మాది తిరుపతిరావు, మండల పార్టీ అధ్యక్షులు ఆముదాల పరమేష్‌, కౌన్సిలర్‌ వి.హర్షవర్ధన్‌ పాల్గొన్నారు.
సీతానగరం: ఇసుక అక్రమ రవాణా అరికట్టాలని కోరుతూ స్థానిక తహశీల్దార్‌కు పార్వతీపురం నియోజకవర్గ టిడిపి ఇన్‌ఛార్జి బోనెల విజరుచంద్ర, మాజీ ఎమ్మెల్సీ ద్వారపూడి జగదీష్‌ వినతిపత్రం అందజేశారు. కార్యక్రమంలో మండల పార్టీ అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు కొల్లి తిరుపతి రావు, రౌతు వేణుగోపాలనాయుడు, పార్టీ నాయకులు జి.వెంకటనాయుడు, ఎస్‌.హరిగోపాలరావు, డి.భానుప్రసాద్‌, బి.శ్రీనివాసరావు, సబ్బాన శ్రీనివాసరావు, దొగ్గ మోహన్‌ రావు, బురాడ చిరంజీవి పాల్గొన్నారు.
మక్కువ : మండలంలోని అక్రమ ఇసుక క్వారీల ద్వారా దందా జరుగుతుందని దీనిని వెంటనే అరికట్టాలని స్థానిక ఉపతహశీల్దార్‌ ఇబ్రహీంకు వినతి పత్రం అందజేశారు. మండల టిడిపి అధ్యక్షులు జి,వేణుగోపాలరావు సీనియర్‌ నాయకులు మావుడి ప్రసాద్‌ నాయుడు ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జరిగింది.
పాచిపెంట : మండలంలోని అక్రమ ఇసుక క్వారీల ద్వారా దందా జరుగుతుందని దీనిని వెంటనే అరికట్టాలని స్థానిక తహశీల్దార్‌ కార్యాలయంలోని ఆర్‌ఐ బి.రమణారావుకు వినతి పత్రం అందజేశారు. కార్యక్రమంలో టిడిపి నాయకులు పిన్నింటి ఈశ్వరరావు, గూడెపు యుగంధర్‌, ముఖీ సూర్యనారాయణ, దండి మోహన్‌ రావు, పల్లెటూరు ఉమామహేశ్వరరావు, కొత్తల పోలినాయుడు పాల్గొన్నారు.