
ప్రజాశక్తి-హిందూపురం : ఇసుక అక్రమ రవాణాపై సెబ్ అధికారులు దృష్టిసారించారు. గురువారం మెరుపు దాడులు నిర్వహించి ట్రాక్టర్లు, జెసిబిని సీజ్ చేశారు. 'అభివృద్ధి పనుల మాటున ఇసుక దందా' అనే శీర్షికన ప్రజాశక్తి దినపత్రికలో వచ్చిన కథనానికి అధికారులు స్పందించారు. సెబ్ సిఐ సువర్ణలత గరువారం సిబ్బందితో కలిసి పెన్నా నది పరివాహక ప్రాంతాల్లో మెరుపు దాడులు నిర్వహించారు. అనుమతులు లేకుండా జెసిబితో ఇసుకను తవ్వుతుండడంతో జెసిబితో పాటు అప్పటికే ఇసుకను నింపిన మూడు ట్రాక్టర్లను సీజ్ చేశారు. ఈసందర్భంగా సెబ్ సిఐ సువర్ణలత మాట్లాడుతు రూరల్ మండలం బేవినహళ్లి సమీపంలో ఉన్నా పెన్నా నది పరివాహక ప్రాంతం నుంచి ఎటువంటి అనుమతులు లేకుండా ఇసుకను అక్రమంగా రవాణా చేస్తున్నారన్నారు. దీంతో మూడు ట్రాక్టర్లను, జెసిబిని సీజ్ చేసి డ్రైవర్లపై కేసు నమోదు చేసినట్లు చెప్పారు.