ప్రజాశక్తి - నందవరం
ఇసుక అక్రమ రవాణాపై పోలీసులు ఉక్కుపాదం మోపుతున్నారు. ఇసుక అక్రమ రవాణా చేస్తున్నట్లు సమాచారం రావడంతో ప్రత్యేక దృష్టి పెట్టిన పోలీసులు మంగళవారం ఉదయం నాగలదిన్నె గ్రామ సమీపంలో తుంగభద్ర నదిలో అక్రమంగా ఇసుక తరలిస్తుండగా ట్రాక్టర్లను పట్టుకున్నారు. ట్రాక్టర్ల ద్వారా ఇసుకను అక్రమంగా రవాణా చేస్తున్న మాదిగ ఆరేకంటి చిట్టి బాబు, బోయ శ్రీనివాసులు, తెలుగు రామకృష్ణ, కురువ తిరుమలేష్, తెలుగు ఉసేని, బోయ వీరేశ్, కురువ లింగప్ప, కురువ రవి అనే ట్రాక్టర్ల డ్రైవర్లు, ఓనర్లపై కేసు నమోదు చేసి, 5 ట్రాక్టర్లను సీజ్ చేసి పోలీసు స్టేషన్‌కు తరలించారు. మొదటి నలుగురు మిట్టాసోమాపురం గ్రామానికి చెందిన వారుగా, మరో నలుగురు ఐజ మండలం రాజాపురం గ్రామానికి చెందిన వ్యక్తులుగా గుర్తించామని పోలీసులు తెలిపారు. ప్రభుత్వ నిబంధనల మేరకే ఇసుకను తరలించాలని, అక్రమంగా తరలించాలని చూస్తే కేసు నమోదు చేసి, జైలుకు పంపుతామని ఎస్‌ఐ పి.తిమ్మయ్య హెచ్చరించారు.
పోలీసులు పట్టుకున్న అక్రమ ఇసుక ట్రాక్టర్లు










