ప్రజాశక్తి - వేటపాలెం, చిన్నగంజాం
చిన్నగంజాం సొన భూముల్లో జరుపుతున్న అక్రమ ఇసుక తవ్వకాలను ఆపాలని కలెక్టర్ రంజిత్ భాషకు సిపిఎం, జనసేన నాయకులు వినతి పత్రం అందజేశారు. స్థానిక తాసిల్దార్ కార్యాలయంలో ఓటర్ల జాబితా దస్త్రాలను పరిశీలించేందుకు వచ్చిన ఆయనను జనసేన రాష్ట్ర కార్యదర్శి విజయ్ కుమార్, సిపిఎం కార్యదర్శి జి ప్రతాప్ కుమార్ కలిశారు. వ్యవసాయ భూముల్లో ఇసుక తవ్వకాలు చేస్తున్నారని వివరించారు. భవిష్యత్తులో నీటి అవసరాలకు ఇబ్బంది పడాల్సి వస్తుందని తెలిపారు. ఈ విషయంపై చట్టపరమైన చర్యలు తీసుకొని తనకు నివేదిక ఇవ్వాలని తాసిల్దార్ పార్వతిని ఆదేశించారు.










