సమావేశంలో మాట్లాడుతున్న ప్రభుత్వ జూనియర్ కళాశాల ప్రిన్సిపల్ లక్ష్మీకాంతరెడ్డి
ప్రజాశక్తి - ధర్మవరం టౌన్ : ప్రతి విద్యార్థి కష్టపడి కాకుండా ఇష్టపడి చదివితే ఉత్తమ భవిష్యత్తుఉంటుందని ప్రభుత్వ జూనియర్ కళాశాల ప్రిన్సిపల్ లక్ష్మీకాంతరెడ్డి, కళాశాల అభివృద్ధి కమిటి చైర్మన్ బండి వేణుగోపాల్ సూచించారు. ఈ మేరకు మంగళవారం స్థానిక ప్రభుత్వ బాలికల జూనియర్ కళాశాలలో ప్రెషర్స్‌డే కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రతి విద్యార్థిని క్రమశిక్షణతో కూడిన విద్యను అభ్యసించాలన్నారు. అనంతరం కళాశాల నుండి బదిలీ అయిన అధ్యాపకులను,బదిలీపై కళాశాలకు వచ్చి అధ్యాపకులకు బహుమతులు అందజేశారు. ఈసందర్భంగా విద్యార్థులు నిర్వహించిన సాంస్కృతిక కార్యక్రమాలు ఆకట్టుకున్నాయి. ఈ కార్యక్రమంలో ప్రభుత్వ బాలుర కళాశాల ప్రిన్సిపల్ ప్రశాంతి, అధ్యాపకులు పాల్గొన్నారు.










