ఇష్టపడి చదివితే ఎంతటి లక్షన్నైనా సాధించవచ్చు : కె లక్ష్మీనారాయణ
- ప్రతిభకు పట్టాభిషేకం పేరుతో విద్యార్థులకు ప్రోత్సాహకాలు
ప్రజాశక్తి - ఎమ్మిగనూరు
ఇష్టపడి చదివితే విద్యార్థులు ఎంతటి లక్ష్యాన్ని అయినా సాధిం చవచ్చు రోహిణీ ఇన్ఫ్రా ఆవెన్యూస్ చైర్మన్, బీసీ సంఘం జాతీయ ఉపాధ్యక్షులు కొంకతి లక్ష్మీనారాయణ అన్నారు. ఆదివారం పట్టణంలోని కుర్ని కల్యాణ మండపంలో ఆధ్వర్యంలో రోహిణి ఇన్ఫ్రా ఆవెన్యూస్ ఆధ్వర్యంలో కుర్ని కల్యాణ మండపంలో ప్రతిభకు పట్టాభిషేకం కార్యక్రమం నిర్వహిం చారు. ముందుగా జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. ముఖ్య అతిథిóగా ఐఏఎస్‌కు ఎంపిక అయిన అంభిక జైన్ పాల్గొన్నారు. అనంతరం ఎమ్మిగనూరు నియోజకవర్గంలో 2023 పది, ఇంటర్ ఫలితాల లో ప్రతిభ కనబరిచిన విద్యార్థులకు 95మంది విద్యార్థులకు రూ.5లక్షలు విలువజేసే నగదు ప్రోత్సాహకాలు బహుమతులు అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ విద్యార్థినిలు రోహిణి ఇన్ఫ్రా అవెన్యూస్ వారు అందించే ప్రోత్సాహక నగదు బహుమతులను సద్వినియోగం చేసుకోవాలన్నారు. విద్యార్థినులకు పట్టుదల, కృషి, ఏకాగ్రత, సంపాదిం చాలనే తపన ఉండాలన్నారు. ఒక నిర్దిష్ట లక్ష్యంతో ముందుకు వెళ్లిన వారికి పేదరికం అడ్డురాదని, ప్రతి ఒక్కరు వారి బలహీనతలను అధిగమించా లన్నారు. ప్రతిరోజు న్యూస్ పేపర్ చదవడంతో పాటు ఇంగ్లీష్ కమ్యూని కేషన్ స్కిల్స్ పెంచుకోవాలన్నారు. పట్టణానికి చెందిన ఐఏఎస్‌కు ఎంపికైన అంబికా జైన్ స్ఫూర్తిగా తీసుకోవాలన్నారు. విద్యార్థులు పోటీతత్వాన్ని అలవర్చుకోవాలని, లక్ష్య సాధన కోసం కృషి చేయాలన్నారు. ఈ కార్యక్రమ ంలో వైష్ణవి డిగ్రీ జూనియర్ కళాశాలలో చైర్మన్ జిడి లింగప్ప, కౌన్సిలర్ కామర్తి నాగేశప్ప, ఎమ్మార్ శ్రీనివాసులు శ్రీరాములు తదితరులు పాల్గొన్నారు.










