ప్రజాశక్తి - చీరాల
విద్యార్థులు చదువులను కష్టంతో కాకుండా ఇష్టంతో చదివితే ఉత్తమ ఫలితాలు పొందుతారని అడిషనల్ జూనియర్ సివిల్ జడ్జి షేక్ నిషాద్ నాజ్ అన్నారు. స్థానిక శ్రీ గౌతమి డిగ్రీ కళాశాలలో శనివారం మండల న్యాయ సేవాధికారి సంస్థ ఆధ్వర్యంలో న్యాయ విజ్ఞాన సదస్సు నిర్వహించారు. క్రమశిక్షణతో ప్రణాళికాబద్దంగా చదివి లక్ష్యాలను సాధించాలని సూచించారు. ఆకతాయిలు టీజింగ్‌కు పాల్పడితే తల్లిదండ్రులు, ఉపాధ్యాయుల దృష్టికి తీసుకెళ్లాలని సూచించారు. ర్యాగింగ్ యాక్ట్, ఫోక్సో ట్టాలపై అవగాహన కల్పించారు. కార్యక్రమంలో కళాశాల డైరెక్టర్ శ్రీనివాస్, 2వ పట్టణ సీఐ సోమశేఖర్, బార్ అసోసియేషన్ ప్రెసిడెంట్ జి రమేష్ బాబు, రిటైనర్ అడ్వాకెట్ టి సురేష్, పిఎల్‌విలు ఎస్‌డి మతీన్, షిలోహ్, ఆర్క్ పాల్గొన్నారు.










