Nov 09,2023 21:09

ఇష్టారాజ్యంగా స్టాఫ్‌ నర్సుల పోస్టింగ్స్‌ !

కడప ప్రతినిధి : జిల్లాలో స్టాఫ్‌నర్స్‌ కౌన్సెలింగ్‌ ఇష్టారాజ్యంగా నడుస్తోంది. ప్రభుత్వం సెప్టెంబర్‌ చివరి వారంలో 94 పోస్టులను భర్తీ చేయాలని నోటిఫి కషన్‌ జారీ చేసింది. ఆర్‌డి కార్యాలయ అధికారులు 8,966 దర ఖాస్తులు స్వీకరించారు. గతంలో ఫేక్‌ సర్టిప ˜ికెట్ల బాగోతం వెలుగులోకి వచ్చిన నేపథ్య ంలో జాగ్రత్తగా దరఖాస్తులను పరిశీలించాల్సి ఉంది. అనంతరం మెరిట్‌, సీనియా రిటీల ఆధారంగా జాబితాను వెల్లడించాల్సి ఉంది. డిఎంహెచ్‌ఒ కార్యాలయంలో కౌన్సిలింగ్‌ ఏర్పాట్లు చేశారు. ఆర్‌డి కార్యాలయ అధికారులు 2022లో నోటిఫికేషన్‌ నెంబర్‌-5లో ఎంపికైన వారి పేర్లను తాజా కౌన్సెలింగుకు ఎంపిక చేయకూడదనే నిబంధనను యథేచ్ఛగా ఉల్లంఘిస్తుండడం చర్చనీయాంశంగా మారింది. 2022 నోటిఫికేషన్‌ ఖాళీల కౌన్సెల్సింగ్‌ పలు దఫాలుగా నడిచింది. 2023 జనవరి 17, 18వ తేదీల్లో 291 స్టాఫ్‌నర్స్‌ పోస్టులకు, అనంతర మాసా ల్లో మరో 331 స్టాఫ్‌నర్స్‌ పోస్టులకు కౌన్సెలింగ్‌ నిర్వహించిన సంగతి తెలిసిందే. సదరు కౌన్సెలిగుల్లో ఎంపికై ఉద్యోగాలు చేస్తున్న సుమారు 25 మంది పేర్లు తాజా కౌన్సెలింగ్‌ జాబితాలో ఉంచినట్లు తెలిసింది. 2022 నోటిఫికేషన్ల నెంబర్‌-5లో ఎంపికై ఉద్యోగాలు చేస్తున్న స్టాఫ్‌నర్స్‌ల పేర్లు, ఇతర వివరాలు రీజినల్‌ డైరెక్టర్‌ కార్యా లయంలో ఉన్నప్పటికీ వారి పేర్లను సెలెక్టెడ్‌ జాబితాలో చేర్చడంలో మతల బేమిటో తెలియడం లేదనే వాదన వినిపిస్తోంది. ఇటీవలే విధుల్లో చేరిన రీజినల్‌ డైరెక్టర్‌కు తెలియ దనుకోవడంలో అర్థం ఉంది. రీజినల్‌ డైరెక్టర్‌ కార్యాలయం అధికారులకు తెలియ దనుకో లేమనే వాదన వినిపిస్తోంది. దీనిపై పలువురు దరఖాస్తుదారులు ప్రశ్నిస్తే 2022 నోటిఫికేషన్‌లో ఎంపికై ఉద్యోగాలు చేస్తున్న వారి పేర్లను తొలగిస్తామని హామీ నిచ్చినట్లు తెలిసింది.. ఆచరణలో ఉద్యోగాలు చేస్తున్న వారి పేర్లను తొలగి ంచక పోవడంతో దరఖాస్తుదారుల్లో అయోమయం నెలకొంది. దీనిపై దరఖా స్తుదా రులు కలెక్టర్‌ దృష్టికి తీసుకెళ్లాలనే ఆలోచనలో ఉన్నట్లు తెలిసింది. కౌన్సెలి ంగ్‌కు 10 రోజుల ముంగిట వేకెన్సీ, కౌన్సెలింగ్‌కు ఎంపికైన జాబితాలను నోటీస్‌ బోర్డు లో డిస్‌ప్లే చేయాల్సి ఉంది. దీనిపై రీజినల్‌ డైరెక్టర్‌, డిడిలను సంప్ర దించగా కౌన్సెలింగ్‌ రోజే కౌన్సెలింగ్‌ దగ్గర డిస్‌ప్లే చేస్తామని పేర్కొనడం గమనార్హం.