ప్రశంసా పత్రం అందుకుంటున్న ఉస్మాన్ బాష
ప్రజాశక్తి - గోనెగండ్ల
మండలంలోని ఉపాధి హామీ చట్టంలో ఇంజినీరింగ్ కన్సల్టెంట్‌గా పని చేస్తున్న ఉస్మాన్ బాష ఉత్తమ సేవ ప్రశంసా పత్రం అందుకున్నారు. గాంధీ జయంతి సందర్భంగా కర్నూలులో ఆయన ప్రశంసాపత్రాన్ని అందుకున్నారు. మండలంలో 2023-24 ఆర్థిక సంవత్సరంలో ఉపాధి హామీ పనులను విస్తృత పరిచి ప్రజలకు ఉపాధి కల్పించడంలో ప్రతిభ కనబరిచినందుకు జెసి నారపురెడ్డి మౌర్య, ఉన్నతాధికారుల చేతుల మీదుగా ప్రశంసా పత్రం అందుకున్నారు. మంగళవారం ఆయనకు ఇన్‌ఛార్జీ ఎంపిడిఒ నాగేష్, ఎఒ బాబు భాస్కర్, ఎపిఒ మహ్మద్ బాష, ఉపాధి సిబ్బంది అభినందనలు తెలిపారు.










