Dec 29,2022 15:41
  • బోధనేతర సిబ్బంది చేతివాటం 
  • ఆందోళన బాటలో అక్కడమిక్ కన్సల్టెంట్ సంఘం నేతలు

ప్రజాశక్తి - క్యాంపస్ : శ్రీ వేంకటేశ్వర విశ్వవిద్యాలయంలో రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకుంటున్న ఫేస్ రీడింగ్ అటెండెన్స్ బోధన సిబ్బందికి మాత్రమే తీసుకోవడం జరుగుతుంది. రాష్ట్రంలోని మిగిలిన అన్ని విశ్వవిద్యాలయాల్లో బోధన, బోధనేతర సిబ్బంది అందరికీ అందరితో కలిపి విద్యార్థులకు కూడా పేస్ రీడింగ్ ని అటెండెన్స్ గా తీసుకోవడం జరుగుతుంది. అయితే శ్రీ వెంకటేశ్వర విశ్వవిద్యాలయంలో విచిత్రంగా కొంతమంది బోధన సిబ్బంది ఫేస్ రీడింగ్ పై తమ అనునాయులకు చేతివాటం దర్శిస్తున్నారు. ఈ విషయంలో భారీ స్థాయిలో అవకతవకలు జరుగుతున్నట్లు వర్సిటీలో ప్రచారం జరుగుతుంది. ఈ విషయంలో అకడమిక్ కన్సల్టెంట్ కు  ఒక్కొక్కరికి  ఒక్కొక్క  విధంగా ఫేస్ రీడింగ్ లో డెసిగ్నేషన్లు మార్చడం జరుగుతున్న ఉన్నతాధికారులు కూడా చూసి చూసినట్లు పోతున్నారని అకడమిక్ కన్సల్టెంట్ సంఘం నేతలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కొంతమంది క్లర్కులు, ఏ ఏ ఓ లు పరిపాలన భవనంలో తమ చేతివాటాన్ని ప్రదర్శిస్తున్నారు. మరి కొన్ని కాలేజీల్లో  ఫేస్ రీడింగ్ ఇన్చార్జులు గా నియమించిన వారు కూడా తమకు నచ్చిన వారికి, అనునాయలకి డిసిగ్నేషన్లో పలు రకాలుగా పెడుతుండడం బాధాకరమని అకడెమిక్ కన్సల్టెంట్ అసోసియేషన్ నేతలు తీవ్రంగా మండిపడుతున్నారు. దీనిపై ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేస్తామని వారు పేర్కొంటున్నారు. అంతేకాకుండా వర్సిటీలో పరిపాలన భవనం, వివిధ కళాశాలలోనీ ప్రిన్సిపల్ ఆఫీసులలో ఏళ్ల తరబడి పాతుకుపోయి అధికార దుర్వినియోగానికి పాల్పడుతున్నారని నేతలు ఆరోపిస్తున్నారు. వెంటనే పేస్ రీడింగ్ ని బోధన, బోధనేతర సిబ్బంది, విద్యార్థిని, విద్యార్థులకు అందరికి కూడా కంపల్సరీ చేయాలని డిమాండ్ చేస్తున్నారు. అలాగే అకాడమిక్ కన్సల్టెంట్ల డిసిగ్నేషన్ ఉన్నతాధికారుల సూచన మేరకు అందరికీ ఒకే విధంగా ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నారు. లేనిపక్షంలో రాష్ట్ర ఉన్నత విద్యా మండలికి, ముఖ్యమంత్రికి ఫిర్యాదు చేస్తామని హెచ్చరించారు.