Sep 12,2023 20:20

పూజలు నిర్వహిస్తున్న ఎమ్మెల్యే బాలనాగిరెడ్డి

ప్రజాశక్తి - కౌతాళం
శ్రీనరసింహ ఉరుకుంద ఈరన్న స్వామిని ఎమ్మెల్యే వై.బాలనాగిరెడ్డి కుటుంబ సమేతంగా దర్శించుకున్నారు. మంగళవారం ఆయన పుణ్యక్షేత్రానికి చేరుకోవడంతో పాలకమండలి సభ్యులు నాగరాజు గౌడ్‌ ఆధ్వర్యంలో దేవాలయ సూపరింటెండెంట్లు రామ్మోహన్‌, వెంకటేష్‌, మల్లికార్జున, ప్రధాన అర్చకులు ఈరప్ప స్వామి, వేద పండితులు పూర్ణకుంభంతో స్వాగతం పలికారు. దేవాలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం శాలువాతో, పూలమాలలతో సన్మానించారు. అనంతరం ఎమ్మెల్యే బాలనాగిరెడ్డి దేవాలయ అధికారులతో అభివృద్ధి పనులపై చర్చించారు. రాజగోపురం నిర్మాణ పనులు, గోపురాలపై కలషాల ఏర్పాటు పనులు ఎప్పుడు పూర్తి చేస్తారని అడిగి తెలుసుకున్నారు. కార్తీక మాసంలో పనులు పూర్తి చేసి ప్రారంభించడానికి ఏర్పాట్లు పూర్తి చేస్తామని అధ్యక్షులు నాగరాజు గౌడ్‌, దేవాలయ అధికారులు వివరించారు. పాలకమండలి సభ్యులు, దేవాలయ ఉప ప్రధాన అర్చకులు మహాదేవ స్వామి, ముఖ్య అర్చకులు శివన్న స్వామి, అర్చకులు నాగరాజు స్వామి, లోకరాజు స్వామి పాల్గొన్నారు.