Aug 10,2023 23:19

అభివృద్ధి పనులను పరిశీలిస్తున్న ఎమ్మెల్యే ఆర్కే

తాడేపల్లి రూరల్‌: ఎంటిఎంసి పరిధిలోని ఇప్పటంలో జరుగుతున్న సుమారు నాలుగు కోట్ల రూపాయల అభివృద్ధి పనులను గురువారం మంగళగిరి ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి మున్సి పల్‌ ఇంజనీరింగ్‌ అధికారులతో కలిసి పరిశీలిం చారు. సీసీ డ్రైన్లు నిర్మాణం, రోడ్ల నిర్మాణం, సొసైటీ కార్యా లయం వద్ద నుండి హిందూ స్మశాన వాటిక వరకు తారు రోడ్డు నిర్మాణ పనులను పరిశీలించి, అధికారులకు పలు సూచనలు చేశారు. కార్యక్రమంలో వైసిపి తాడేపల్లి మం డల యువజన విభాగం అధ్యక్షులు ఎం.వివేకానందరెడ్డి, వైసిపి నాయకులు తులసీదాస్‌, బ్రహ్మారెడ్డి, గోపి పాల్గొన్నారు.