ఒకటిన జీతాలు, పెన్షన్‌లు చెల్లించాలి.
ఇపిఎఫ్‌ఒ 95 పెన్షనర్లకు కనీస పెన్షన్ రూ.9వేలు..
డిఎ బకాయిలు మంజూరు చేయాలి
నూతన పిఆర్‌సి ను వెంటనే అమలు చేయాలి
పెన్షనర్ల బిక్షాటన ప్రదర్శన
ప్రజాశక్తి - కాకినాడ
భారతదేశవ్యాప్తంగా ఉన్న 186 పరిశ్రమలు, ప్రభుత్వ రంగ సంస్థలు, కోపరేటివ్ సంస్థల్లో పనిచేసి రిటైర్ అయిన ఇపిఎఫ్ పెన్షనర్లకు సంబంధించి పిఎఫ్ నిధులను షేర్ మార్కెట్‌కు తరలించడం తగదని, వెంటనే ఈ నిర్ణ యాన్ని కేంద్రం ఉపసంహరిం చుకోవాలని, ఇప్పటికే షేర్ మార్కెట్‌కు తర లించిన నిధులను వెనుకకు రాబట్టాలని ఆల్ పెన్షనర్స్ అండ్ రిటైర్డ్ పర్సన్స్ అసోసియేషన్ రాష్ట్ర కోశాధికారి సిహెచ్ సత్యనారాయణరాజు డిమాండ్ చేశారు. గురువారం నాగమల్లి తోట సెంటర్ అల్లూరి సీతారామరాజు విగ్రహం వద్ద ఆల్ ఇండియా కోఆర్డినేషన్ కమిటీ ఆఫ్ ఇపిఎఫ్ పెన్షనర్స్ అసోసియేషన్ న్యూఢిల్లీ పిలుపు మేరకు ఆల్ పెన్షనర్స్ అండ్ రిటైర్డ్ పర్సన్స్ అసోసియేషన్ కాకినాడ జిల్లా శాఖ ఆధ్వర్యంలో కేంద్రంలో బిజెపి ప్రభుత్వం ఇపిఎఫ్ పెన్షనర్ల పట్ల వ్యవహరిస్తున్న నిర్లక్ష్య వైఖరికి వ్యతిరేకంగా పళ్లాలు వాయించి నిరసన తెలియజేశారు. తొలిత అల్లూరి సీతారామరాజు విగ్రహానికి రాష్ట్ర కోశాధికారి సిహెచ్ సత్యనారాయణ రాజు పూలమాలవేసి నివాళులర్పించారు. అక్కడి నుండి కాకినాడ ఎంపి వంగా గీత క్యాంపు కార్యాలయం వరకు భిక్షాటన చేస్తూ ప్రదర్శన నిర్వహించారు. వచ్చే పార్లమెంటు సమావేశాల్లో వంగా గీతా విశ్వనాధ్ ఇపిఎఫ్ పెన్షనర్ల సమస్యలపై పార్లమెంట్లో బిజెపి ప్రభుత్వాన్ని ప్రశ్నించి సమస్యల పరిష్కారానికి సహకరించాలని ఎపిఆర్‌పిఎ కాకినాడ జిల్లా శాఖ విజ్ఞప్తి చేసింది. ఎం.పి అందుబాటులో లేనందున కార్యాలయపు అధికారి ఎస్ సతీష్‌కు వినతిపత్రం అందజేశారు. ఎంపీ గ్రామంలోకి వచ్చిన వెంటనే సమస్యలు ఆమె దృష్టికి తీసుకువెళ్లి ప్రస్తావించేదానికి వివరాలు సమర్పిస్తామని సతీష్ తెలియజేశారు.
సమస్యల పరిష్కారానికి ఏమాత్రం కూడా సానుకూల స్పందన కనపరచని పరిస్థితుల్లో దేశవ్యాప్తంగా సంవత్సర కాలంపాటు ఇపిఎఫ్ పెన్షనర్లు నిరంతర పోరాటం చేపట్టడానికి ఎఇసిసి కమిటీ తీర్మానించింది. కావున ఈ పోరాట కార్యక్రమంలో రాష్ట్రంలో ఉన్న ఈపీఎఫ్ పెన్షనర్లు అందరూ స్వచ్ఛందంగా పాల్గొని విజయవంతం చేయాలని రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కే సత్తిరాజు తెలియజేశారు. దేశంలో 77 లక్షల మంది ఈపీఎఫ్ పెన్షనర్లు ఉంటే వారిలో 35 లక్షల మంది కనీస పెన్షన్ వెయ్యి రూపాయల లోపు పొందుతున్నారు. పెరిగిన ధరలు, జిఎస్టిపన్నులు, ప్రయాణ చార్జీలు, అనారోగ్య సమస్యలతో పెన్షనర్లు ఏ విధంగా బ్రతకగలరని ప్రశ్నించారు. కాబట్టి కేంద్రం వెంటనే ఈపీఎఫ్ పెన్షనర్లు అందరికీ కనీస పెన్షన్ తొమ్మిది వేలు డీఏతో చెల్లించాలని సత్తిరాజు డిమాండ్ చేశారు. కార్యక్రమంలో సహ అధ్యక్షులు కర్రి బాబురావు, జోగ అప్పారావు, మోహన మురళీ కృష్ణ, వీరభద్రరావు, బర్ణ బసు, డాక్టర్ శిరీష, అముజూరి అప్పారావు, మేడిశెట్టి వెంకటరమణ మలకా వెంకటరమణ తదితరులు పాల్గొన్నారు.
ఎంపి గీత కార్యాలయ అధికారి సతీష్ కు వినతిపత్రం సమర్పిస్తున్న నాయకులు










