May 20,2023 14:55

ప్రజాశక్తి-తిరుపతి సిటీ : తిరుపతి జిల్లా కేంద్రంలో కేంద్రం,, రాష్ట్ర పర్యాటక శాఖలచే సంయుక్తంగా నిర్వహిస్తున్న స్టేట్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ హోటల్ మేనేజ్ మెంట్, క్యాటరింగ్ టెక్నాలజీ, అప్లైడ్ న్యూట్రీషియన్ కళాశాలలో 2023-24 సంవత్సరం హోటల్ మేనేజ్ మెంట్ కోర్సులకు దరఖాస్తుల స్వీకరణ  జూలై 30 వరకు ఉంటుందని సద్వినియోగం చేసుకోవాలని ప్రిన్సిపల్ డా.ఆర్.రమణ ప్రసాద్  ఒక ప్రకటనలో  తెలిపారు.

కోర్సుల వివరాలు : 

1. బి.ఎస్.సి. మూడు సంవత్సరాల డిగ్రీ కోర్సుకు ఇంటర్ నందు 50 శాతం మార్కులు కలిగిన వారు

2. క్రాఫ్ట్ కోర్స్ ఇన్ ఫుడ్ ప్రొడక్షన్ 1 ½  సంవత్సరం ఎస్.ఎస్.సి. పాసైన వారు

3. సర్టిఫికేట్ కోర్స్ ఇన్ ఫుడ్ అండ్ బెవరేజ్ సర్వీసెస్ ఆరు నెలలు ఎస్.ఎస్.సి. పాసైన వారు అర్హులని, కోర్సు పూర్తైన తరువాత ప్రముఖ ఫైవ్ స్టార్ హోటల్స్ లో ఉద్యోగ అవకాశాలు, బ్యాంక్ లోన్ సదుపాయం, రవాణా సౌకర్యం, బాల బాలికలకు వేరు వేరు హాస్టల్స్ సదుపాయం కలదని యువత సద్వినియోగం చేసుకోవాలని, వివరాలకు 9700440604, 9100558006, 9701343846 నెంబర్లను సంప్రదించాలని www.sihmtpt.org నందు దరఖాస్తులు అందుబాటులో ఉన్నాయని తెలిపారు.