Oct 11,2023 16:09

ప్రజాశక్తి - పెద్దాపురం : స్థానిక వీర్రాజు హైస్కూల్లో బుధవారం ఐసిడిఎస్ ఆధ్వర్యంలో అంతర్జాతీయ బాలికా దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా హెడ్మాస్టర్ కె.వి లక్ష్మీనారాయణ అధ్యక్షతన బాలికలకు సంబంధించిన అన్ని అంశాలపై అవగాహన సదస్సు నిర్వహించారు.ఈ సదస్సులో ఐసిడిఎస్ సూపర్వైజర్ సిహెచ్ వెంకటలక్ష్మి మాట్లాడుతూ బాలికలు,కిషోర్ బాలికలు పోషక విలువల ఆహారం తీసుకోవడం ద్వారా ఆరోగ్యాన్ని పరిరక్షించుకోవాలన్నారు.విద్యా హక్కు చట్టం,బాల్య వివాహాల వల్ల నష్టాలు,లింగ వివక్షత వంటి అంశాలపై అవగాహన కల్పించారు.ముఖ్యంగా బాలికలపై లైంగిక వేధింపులు,బాలికల అక్రమ రవాణా వంటి అంశాలపై బాలికలకు అర్థమయ్యే రీతిలో వివరించారు. అనంతరం అవగాహనా ర్యాలీ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో అంగన్వాడీ వర్కర్లు పద్మ,స్నేహ, జ్యోతి, తులసి, గౌరీ, దుర్గాదేవి, మాధవి, అమ్మాజీ, మంగ, ఈశ్వరి తదితరులు పాల్గొన్నారు.