Jul 28,2023 22:41
  • చేతులెత్తేసిన యురోపియన్‌ యూనియన్‌

బ్రస్సెల్స్‌ : ఉక్రెయిన్‌ గోధుమల ఎగుమతులకు సబ్సిడీ ఇవ్వడానికి యురోపియన్‌ కమిషన్‌ తిరస్కరించింది. తమ వద్ద అంత డబ్బు లేదని తెలిపింది. అయితే ఈ ఆలోచనను కొంతమంది ఇయు సభ్యులు వ్యతిరేకిస్తునాురు. రష్యాపై యుద్ధం జరుపుతును ఉక్రెయిన్‌కు మద్దతుగా ఉక్రెయిన్‌ ఉత్పత్తులపై టారిఫ్‌లను, కోటాలను ఇయు గతేడాది తొలగించింది. ఉక్రెయిన్‌ గోధుమలను నల్ల సముద్రం గుండా తీసుకెళ్లే వాణిజ్యపరమైన నౌకలకు భద్రతాపరమైన హామీలివ్వడానికి గతేడాది జులైలో రష్యా అంగీకరించింది. కానీ ఈ నెల ప్రారంభంలో ఈ ఒప్పందం కుప్పకూలింది. తమ స్వంత ఆహార, ఎరువుల వాణిజ్యంపై ఆంక్షల విషయంలో రష్యాకు ముందుగా హామీ ఇచ్చిన రీతిలో ఉపశమనం లభించకపోవడంతో ఒప్పందం అమలును నిలుపుచేసినట్లు ప్రకటించింది.
నల్ల సముద్రం రూట్‌ను కోల్పోయినందున దానిు భర్తీ చేయడానికి ఇతర మార్గాలను కీవ్‌ అన్వేషిస్తోంది. అందుకుగానూ అవసరమైన డబ్బును చెల్లించాల్సిందిగా ఇయును కోరింది. గత వారం ఇయు వాణిజ్య చీఫ్‌కుఉక్రెయిన్‌ ప్రభుత్వం ఈ మేరకుఒక లేఖ రాసింది. రవాణాకుఅయ్యే వ్యయంలో కొంత మొత్తానిు భరించాలంటూ కోరింది. ఇయు ద్వారా ఉక్రెయిన్‌ ఉత్పత్తులు రవాణా అవుతాయి. ఈ మొత్తం ఒక్కో టనుుకు30నుండి 40 యూరోలు వుంటుందనిఅంచనా వేశారు. గోధుమల రవాణాకుమద్దతివ్వడానికి తమకుఒక పరిష్కారం అంటూ దొరకడం లేదనిసంబంధిత వర్గాలు తెలిపాయి. మధ్యంతర బడ్జెట్‌ సమీక్ష జరిగిన తర్వాత అదనపు నిధులు కేటాయించవచ్చనిమరో వర్గాలు తెలిపాయి. అయితే దీనికి నెలల తరబడి సమయం పట్టే అవకాశం వుంది. మరికొనిు ఇయు సభ్య దేశాలు ఈ ఆలోచననే తిరస్కరిస్తునాుయి.