Oct 14,2023 16:14
  • మహ్మద్ సిరాజ్, బుమ్రా, హార్దిక్ పాండ్యా, కుల్దీప్ యాదవ్, రవీంద్ర జడేజాలు రెండేసి వికెట్లు తీసి పాక్ ను 191పరుగులకే కుప్పకుల్చారు.  
  • పాకిస్తాన్ బ్యాట్స్ మెన్లలో కెప్టెన్ అజాం(50), రిజ్వాన్‌(49) రాణించగా,  షఫీక్ (20), ఇమామ్ ఉల్ హక్(36) కొంత ప్రయత్నం చేశారు. ఐదుగురు పాకిస్తాన్ బ్యాట్స్ మెన్లు రెండంకెల స్కోర్ చేయకుండానే ఔట్ అయ్యారు. 
  • 69 బంతుల్లో 7 ఫోర్లతో అర్ధ సెంచరీ చేరువగా ఉన్న పాకిస్తాన్ వికెట్ కీపర్ మహ్మద్‌ రిజ్వాన్‌ 49పరుగుల వద్ద  బుమ్రా బౌలింగ్ లో ఔట్ అయ్యాడు. 
  • పాకిస్తాన్ ఐదో వికెట్ ను కోల్పోయింది. 
  • పాకిస్తాన్ నాల్గో వికెట్ గా షకీల్ (6) ను కోల్పోయింది. కుల్దీప్ బౌలింగ్ లో ఎల్బీడబ్ల్యూ గా షకీల్ ఔట్ అయ్యాడు. 

ఐసీసీ క్రికెట్‌ వరల్డ్‌ కప్‌ 2023లో నేడు భారత్‌-పాకిస్థాన్‌ మ్యాచ్ ప్రారంభం అయింది.  అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోడీ స్టేడియం వేదికగా జరుగుతున్న ఈ మ్యాచ్ లో పాకిస్థాన్‌ 30 ఓవర్లలో 3 వికెట్లు కోల్పోయి 156 చేసింది. ప్రస్తుతం షకీల్ (1), మహ్మద్‌ రిజ్వాన్‌'(47) ఐసీసీ క్రికెట్‌ వరల్డ్‌ కప్‌ 2023లో ఈరోజు హైఓల్టేజ్‌ మ్యాచ్‌ జరుగుతోంది.. ఈ మ్యాచ్‌లో టాస్‌ గెలిచిన భారత్ జట్టు ఫీల్డింగ్‌ ఎంచుకుంది. దీంతో పాకిస్థాన్‌ బ్యాటింగ్‌కు దిగింది. 

సిరాజ్ 2 వికెట్లు, పాండ్యా ఒక వికెట్ తీసి పాకిస్తాన్ ను కట్టడి చేసే ప్రయత్నం చేశారు. పాకిస్తాన్ కెప్టెన్ అజాం 58 బంతుల్లో 50 పరుగులు(4ఫోర్లు) చేసి సిరాజ్ బౌలింగ్ లో ఔట్ అయ్యారు. 


భారత్ జట్టు  : రోహిత్ శర్మ, శుభ్‌మన్ గిల్, విరాట్ కోహ్లీ, శ్రేయాస్ అయ్యర్, కేఎల్ రాహుల్, హార్దిక్ పాండ్యా, రవీంద్ర జడేజా, శార్దూల్ ఠాకూర్, కుల్దీప్ యాదవ్, మహ్మద్ సిరాజ్, జస్‌ప్రీత్ బుమ్రా.

పాకిస్థాన్ జట్టు : అబ్దుల్లా షఫీక్, ఇమామ్ ఉల్ హక్, బాబర్ ఆజం (కెప్టెన్), మహ్మద్ రిజ్వాన్ (వికెట్ కీపర్), సౌద్ షకీల్, ఇఫ్తీకర్ అహ్మద్, షాదాబ్ ఖాన్, మహ్మద్ నవాజ్, షాహీన్ అఫ్రిది, హసన్ అలీ, హరీస్ రవూఫ్.