Aug 04,2021 00:00

*   మ. 3.30ని.ల నుంచి సోనీ స్పోర్ట్స్‌లో
లండన్‌ :
భారత్‌-ఇంగ్లండ్‌ జట్ల మధ్య ఐదు టెస్ట్‌ మ్యాచ్‌ల సిరీస్‌ బుధవారం నుంచి ప్రారంభం కానుంది. ఐసిసి ప్రపంచ టెస్టు చాంపియన్‌షిప్‌ రెండో ఎడిషన్‌లో ఇరుజట్ల తలపడడం ఇదే ప్రథమం. దీంతో రెండు జట్లు గెలుపుకు హోరాహోరీగా తలపడడం ఖాయం. ఓపెనర్‌ కేఎల్‌ రాహుల్‌ ప్రస్తుతం మిడిలార్డర్‌లో ఆడేందుకు ఆసక్తి చూపిస్తున్నా.. గాయం కారణంగా మయాంక్‌ అగర్వాల్‌ ఈ టెస్టుకు దూరం కావడంతో జట్టు మేనేజ్‌మెంట్‌ అతడిని ఓపెనర్‌గా ప్రమోట్‌ చేయనుంది. ఈ ఏడాది భారత పర్యటనలో ఇంగ్లండ్‌ టెస్ట్‌ సిరీస్‌ను 1ా3తో చేజార్చుకున్న సంగతి తెలిసిందే. దీంతో స్వదేశంలో ఎలాగైనా భారత జట్టుపై పైచేయి సాధించాలని జో రూట్‌ సేన ఉవ్విళ్లూరుతుండగా.. ఐసిసి ప్రపంచ టెస్ట్‌ ఛాంపియన్‌షిప్‌ ఫైనల్లో న్యూజిలాండ్‌ చేతిలో ఓటమికి ధీటుగా బదులు చెప్పాలని కోహ్లి సేన ఎదురుచూస్తోంది. డబ్ల్యుటిసి ఫైనల్‌కు ముందు జరిగిన టెస్టు సిరీస్‌లో ఇంగ్లండ్‌జట్టు న్యూజిలాండ్‌ చేతిలో ఓడింది.

జట్ల అంచనా :
భారత్‌ :
కోహ్లి(కెప్టెన్‌), రాహుల్‌, పుజారా, రహానే, ఈశ్వరన్‌, విహారి, అశ్విన్‌, జడేజా, అక్షర్‌ పటేల్‌, రిషబ్‌ పంత్‌/సాహా(వికెట్‌ కీపర్లు), బుమ్రా, ఇషాంత్‌, షమీ, సిరాజ్‌, శార్దూల్‌ ఠాకూర్‌, ఉమేశ్‌.

ఇంగ్లండ్‌ : రూట్‌(కెప్టెన్‌), బర్న్స్‌, సిబ్లే, బట్లర్‌, మార్క్‌ వుడ్‌, సామ్‌ కరన్‌, జేమ్స్‌ ఆండర్సన్‌, బెయిర్‌స్టో, బెస్‌, బ్రాడ్‌, క్రాలే, హమీద్‌, లారెన్స్‌, లీచ్‌, పోప్‌, రాబిన్‌సన్‌, ఓవర్టన్‌.