
- కోహ్లీ, శ్రేయస్ సెంచరీలు
- షమీ కెరీర్‌లో బెస్ట్ బౌలింగ్
- సెమీస్‌లో న్యూజిలాండ్‌పై 70పరుగుల తేడాతో గెలుపు
- వరుసగా 10వ గెలుపుతో టీమిండియా రికార్డు
ముంబయి: 13వ ఐసిసి వన్డే ప్రపంచ కప్ ఫైనల్లోకి టీమిండియా దూసుకెళ్లింది. తొలిగా బ్యాటింగ్‌కు దిగిన భారత్ నిర్ణీత 50 ఓవర్లలో 4వికెట్ల నష్టానికి 397పరుగుల భారీస్కోర్‌ను నమోదు చేసింది. విరాట్ కోహ్లి (117), శ్రేయస్(107) సెంచరీలతో కదం తొక్కారు. ఛేదనలో న్యూజిలాండ్ జట్టు 48.5ఓవర్లలో 327పరుగులకు ఆలౌటైంది. మహ్మద్ షమీ(7/57) కెరీర్ బెస్ట్ బౌలింగ్‌తో మెరిసాడు. 2011లో 2వ సారి వన్డే ప్రపంచకప్‌ను నెగ్గిన టీమిండియా.. 3వ టైటిల్‌ను చేజిక్కించుకొనేందుకు మెట్టు దూరంలో నిలిచింది. టాస్ గెలిచిన రోహిత్ శర్మ తొలిగా బ్యాటింగ్‌కు మొగ్గు చూపాడు. విరాట్ కోహ్లీ (117; 113 బంతుల్లో, 9ఫోర్లు, 2సిక్సర్లు) రికార్డు సెంచరీకి తోడు శ్రేయస్ అయ్యర్ (105; 70 బంతుల్లో, 4ఫోర్లు, 8సిక్సర్లు) సెంచరీలతో కదం తొక్కారు. వీరికి తోడు కెప్టెన్ రోహిత్ శర్మ (47; 29 బంతుల్లో నాలుగు ఫోర్లు, నాలుగు సిక్సర్లు)కి తోడు శుభ్‌మన్ గిల్ (80నాటౌట్, 66బంతుల్లో, 8ఫోర్లు, 3సిక్సర్లు) బ్యాటింగ్‌లో మెరిసారు. 2వ వికెట్‌కు కోహ్లి-గిల్-శ్రేయస్ కలిసి ఏకంగా 256పరుగులు జతచేశారు. దీంతో భారత్ నిర్ణీత 50 ఓవర్లలో కూడా రాణించడంతో కివీస్ ఎదుట భారత్ భారీ లక్ష్యాన్ని నిలిపింది. సోథీకి మూడు, బౌల్ట్‌కు ఒక వికెట్ దక్కాయి. ఛేదనలో భాగంగా న్యూజిలాండ్ ఇన్నింగ్స్ ధాటిగానే ప్రారంభించింది. తొలి రెండు వికెట్లను 39పరుగులకే కోల్పోయి కివీస్ జట్టు 3వ వికెట్‌కు మిఛెల్-విలియమ్సన్ కలి 189పరుగులు జతచేశారు. ఈ క్రమంలో మిఛెల్(134) సెంచరీతో కదం తొక్కగా.. కెప్టెన్ విలియమ్సన్(69) అర్ధసెంచరీతో మెరిసాడు.
- కోహ్లీ, అయ్యర్ సెంచరీలు..
గిల్ రిటైర్డ్ హార్ట్‌గా వెనుదిరగడంతో క్రీజులోకి వచ్చిన శ్రేయస్ ఆకాశమే హద్దుగా చెలరేగి ఆడాడు. కోహ్లీ 59 బంతుల్లో అర్థ సెంచరీ పూర్తిచేసుకుని గేర్ మార్చాడు. మరోవైపు శాంట్నర్ వేసిన 37వ ఓవర్లో రెండో బంతికి సింగి ల్ తీసిన శ్రేయస్.. అర్థ సెంచరీ చేశాడు. ఈ ఇద్దరి దూకుడుతో భారత్ స్కోరు 40ఓవర్లకే 287 పరుగులకు చేరింది. ఫెర్గూసన్ వేసిన 42వ ఓవర్లో నాలుగో బంతికి రెండు పరుగులు తీయడంతో కోహ్లీ సెంచరీ పూర్తయింది. వన్డేలలో కోహ్లీకి ఇది 50వ సెంచరీ. తద్వారా సచిన్ వన్డేలలో సాధించిన 49 శతకాల రికార్డును బ్రేక్ చేశాడు. శతకం ముగిసిన వెంటనే సౌథీ వేసిన 44వ ఓవర్లో భారీ షాట్ ఆడబోయి కాన్వేకు క్యాచ్ ఇచ్చి ఔటయ్యాడు.
షమీ కెరీర్ బెస్ట్..
న్యూజిలాండ్ జట్టు లక్ష్యాన్ని ఛేదించే దిశగా వెళ్తున్న దశలో మహ్మద్ షమీ అద్భుత బౌలింగ్‌తో అలరించాడు. వన్డే ప్రపంచకప్‌లో టీమిండియా తరఫున అత్యుత్తమ బౌలింగ్ గణాంకాలను షమీ తన పేర లిఖించుకున్నాడు. న్యూజిలాండ్ జట్టు 42.4 ఓవర్లలో 4వికెట్ల నష్టానికి 295పరుగులు చేసి విజయానికి చేరువ అవుతున్న దశలో షమీ ఒక్కసారిగా నిప్పులు చెరిగాడు. కెరీర్ బెస్ట్ (7/57) బౌలింగ్ గణాంకాలను నమోదు చేశాడు. షమీ నిప్పులు చెరిగే బౌలింగ్‌కు న్యూజిలాండ్ జట్టు 48.5 ఓవర్లలో 327పరుగులకు కుప్పకూలింది. ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ షమీకి లభించింది.
స్కోర్‌బోర్డు..
ఇండియా ఇన్నింగ్స్: రోహిత్ (సి)విలియమ్సన్ (బి)సోథీ 47, శుభ్‌మన్ (నాటౌట్) 80, కోహ్లి (సి)కాన్వే (బి)సోథీ 117, శ్రేయస్ (సి)మిఛెల్ (బి)బౌల్ట్ 105, కెఎల్ రాహుల్ (నాటౌట్) 39, సూర్యకుమార్ యాదవ్ (సి)ఫిలిప్స్ (బి)సోథీ 1, అదనం 8. (50 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి) 397పరుగులు. వికెట్ల పతనం: 1/71, 2/327, 3/381, 4/382 బౌలింగ్: బౌల్ట్ 10-0-86-1, సోథీ 10-0-100-3, సాంట్నర్ 10-1-51-0, ఫెర్గుసన్ 8-0-65-0, రచిన్ రవీంద్ర 7-0-60-0, ఫిలిప్స్ 5-0-33-0
న్యూజిలాండ్ ఇన్నింగ్స్: కాన్వే (సి)కెఎల్ రాహుల్ (బి)షమీ 13, రవీంద్ర (సి)రాహుల్ (బి)షమీ 13, విలియమ్సన్ (సి)సూర్యకుమార్ (బి)షమీ 69, మిఛెల్ (సి)జడేజా (బి)షమీ 134, లాథమ్ (ఎల్‌బి)షమీ 0, ఫిలిప్స్ (సి)జడేజా (బి)బుమ్రా 41, ఛాప్మన్ (సి)జడేజా (బి)కుల్దీప్ 2, సాంట్నర్ (సి)రోహిత్ (బి)సిరాజ్ 9, సోథీ (సి)రాహుల్ (బి)షమీ 9, బౌల్ట్ (నాటౌట్) 2, ఫెర్గుసన్ (సి)రాహుల్ (బి)షమీ 6, అదనం 29. (48.5ఓవర్లలో ఆలౌట్) 327పరుగులు. వికెట్ల పతనం: 1/30, 2/39, 3/220, 4/220, 5/295, 6/298, 7/306, 8/319, 9/321, 10/327 బౌలింగ్: బుమ్రా 10-1-64-1, సిరాజ్ 9-1-78-1, షమీ 9.5-0-57-7, జడేజా 10-0-63-0, కుల్దీప్ 10-0-56-1.