Jul 25,2021 12:55

ఢిల్లీ : దేశంలో కరోనా వ్యాప్తి కొనసాగుతోంది. కొన్ని రోజులుగా కోవిడ్‌ కొత్త కేసులు, మరణాల్లో హెచ్చుతగ్గులు నమోదవుతున్నాయి. కోవిడ్‌ కట్టడికిగాను ఇప్పటికే దేశవ్యాప్తంగా కోవిడ్‌ వ్యాక్సినేషన్‌ కార్యక్రమం ముమ్మరంగా సాగుతోంది. నిన్న 51,18,210 మందికి వ్యాక్సిన్‌ను అందించారు. దీంతో ఇప్పటి వరకూ పంపిణీ చేసిన వ్యాక్సిన్‌ డోసుల సంఖ్య 43,31,50,864కి చేరింది.
    గడిచిన 24 గంటల్లో కొత్తగా 39,742 కోవిడ్‌ కేసులు నమోదవ్వగా, 535 మరణాలు చోటుచేసుకున్నాయి. గడిచిన 24 గంటల్లో 17,18,756 మందికి కరోనా నిర్ధారణ పరీక్షలను నిర్వహించారు. తాజా మరణాలతో కలిపి ఇప్పటి వరకూ కోవిడ్‌తో మఅతి చెందిన వారి సంఖ్య 4,20,551కి చేరింది. ప్రస్తుతం క్రియాశీల కేసుల సంఖ్య 4,08,212కి చేరి.. ఆ రేటు 1.30 శాతానికి తగ్గింది. కొత్త కేసులతో పోలిస్తే.. కోవిడ్‌ రికవరీల సంఖ్య కూడా దాదాపు సమానంగా ఉంది. గడిచిన 24 గంటల్లో 39,972 మంది కరోనాను జయించారు. దీంతో ఇప్పటి వరకూ కోవిడ్‌ నుంచి కోలుకున్నవారి సంఖ్య 3,05,43,138కి చేరింది.