Oct 07,2023 08:39

ఆసియాక్రీడల్లో భారత్ సత్తా చాటింది. చరిత్రలోనే తొలిసారి 100 పతకాల గెలిచి సరి కొత్త రికార్డు సృష్టించింది. తాజగా కబడ్డీలో మహిళల జట్టు గోల్డ్‌మెడల్‌ సాధించడంతో.. భారత్‌ ఈ ఘనత సాధిచింది. శనివారం కబడ్డీ ఫైనల్ లో చైనీస్ తైపీ జట్టుతో భారత్ మహిళా కబడ్డీ జట్టు తలపడింది. ఉత్కంఠభరితంగా సాగిన ఈ పోరులో 26-25తో చైనీస్ తైపీపై భారత్‌ ఘనవిజయం సాధించింది. దీంతో భారత మహిళల కబడ్డీ జట్టు స్వర్ణ పతకం కైవసం చేసుకుంది. భారత్ సాధించిన మొత్తం 100 పతకాల్లో 25 గోల్డ్‌, 35 సిల్వర్‌, 40 బ్రాంజ్‌ పతకాలు ఉన్నాయి.