Jan 01,2023 22:49

ప్రజాశక్తి - ఏలూరు స్పోర్ట్స్‌
              ఏలూరు రేంజ్‌ డిఐజి పాలరాజు ఉద్యోగోన్నతి పొందారు. ఇన్‌స్పెక్టర్‌ జనరల్‌ ఆఫ్‌ పోలీస్‌గా ఆయన నియమితులయ్యారు. ఈ మేరకు ఆదివారం ఏలూరు రేంజ్‌ కార్యాలయంలో బాధ్యతలు స్వీకరించారు. సాధారణ ఉద్యోగ రాష్ట్రస్థాయి ప్రమోషన్లలో భాగంగా నలుగురు ఐపిఎస్‌లకు ఉద్యోగోన్నతి కల్పిస్తూ రాష్ట్ర ప్రభుత్వం శనివారం ఉత్తర్వులు జారీ చేసింది. అందులో భాగంగా పాలరాజుకు కూడా ఉద్యోగోన్నత కల్పించింది. ఈ సందర్భంగా ఆయనను ఏలూరు రేంజ్‌లో పనిచేస్తున్న జిల్లా ఎస్‌పిలు, ఏలూరు నగరంలోని పలువురు పోలీసు అధికారులు మర్యాదపూర్వకంగా కలిసి శుభాకాంక్షలు తెలిపారు.