Sep 21,2023 21:04

ముంపునకు గురైన ఇన్‌ఫిల్టర్‌ బావి

పార్వతీపురం టౌన్‌: ఎగువ ప్రాంతాల నుండి వచ్చే వరద నీరు ఎక్కువగా నాగావళి నదిలోకి చేరుకోవడంతో ఇరిగేషన్‌ అధికారులు బుధవారం రాత్రి తోటపల్లి రిజర్వాయర్‌ గేట్లును ఎత్తివేశారు. దీంతో రిజర్వాయర్‌ దిగువన పట్టణ ప్రజలకు తాగునీరం దించే ఇన్‌ఫిల్టరేషన్‌ బావులపై నుండి వరద నీరు ప్రవహిస్తుంది. ఈ విషయమై పంప్‌ హౌస్‌ వద్ద ఉన్న తాగునీటి విభాగం సిబ్బంది మున్సిపల్‌ ఇంజనీరింగ్‌ అధికారులకు సమాచారం ఇవ్వడంతోపట్టణంలో పలు వార్డుల్లో తాగునీటి సరఫరాకు అంతరాయం ఏర్పడే అవకాశం ఉందని అధికారులు గురువారం ఒక ప్రకటనలో తెలిపారు.