ఇన్నర్ వీల్ క్లబ్ ఆధ్వర్యంలో మహిళలకు ఘన సన్మానం
ప్రజాశక్తి-డోన్
అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా ఇన్నర్ వీల్ క్లబ్ ఆధ్వర్యంలో 16 మంది మహిళలకు ఘన సన్మానం చేపట్టినట్లు ఇన్నర్ విల్ క్లబ్ అధ్యక్షురాలు ఆర్టీసీ ఆర్‌ఏ శాంతి పేర్కొన్నారు. బుధవారం ఉత్తమ మహిళా అవార్డు గ్రహీత లు జయ శారద,నెట్టికంతమ్మ,మౌనిక,లక్ష్మి,ఆర్టీసీ కండక్టర్లు ఎంవిల్ దేవి,వైవిల్ దేవి,లీలావతి,వనిత, వరలక్ష్మిలను ఇన్నర్ వీల్ క్లబ్ జిల్లా చైర్మన్ సుమిత్ర,ఇన్నర్ వీల్ క్లబ్ వ్యవస్థాపకురాలు రాజా సుజాత, ఇన్నర్ విల్ క్లబ్ అధ్యక్షురాలు ఆర్టీసీ ఆర్‌ఏ శాంతిలు పూలమాలలతో శాలువలతో ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమానికి ఆర్థిక సహకారం లక్ష్మి,శారద,నందిపల్లి నారాయణలు అందించారు. ఈ సందర్భంగా ఇన్నర్ క్లబ్ అధ్యక్షురాలు ఆర్టీసీ ఆర్‌ఏ శాంతి మాట్లాడారు.










