Apr 28,2023 19:38

సమావేశంలో మాట్లాడుతున్న నాయకులు

ప్రజాశక్తి-ఆదోనిరూరల్‌
కేంద్ర ప్రభుత్వం అవలంభిస్తున్న ప్రజావ్యతిరేక విధానాలకు వ్యతిరేకంగా సిపిఎం, సిపిఐ ఆధ్వర్యంలో ఈ నెల 30న రిక్రియేషన్‌ క్లబ్‌ ఆవరణలో జరిగే ప్రచార భేరి సభను జయప్రదం చేయాలని నాయకులు కోరారు. శుక్రవారం స్థానిక సుందరయ్య భవన్‌లో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా సిపిఐ, సిపిఎం మండల కార్యదర్శులు బసాపురం గోపాల్‌, లింగన్న, పట్టణ కార్యదర్శులు లక్ష్మన్న, సుదర్శన్‌ మాట్లాడారు. ప్రజాస్వామ్య పరిరక్షణకు అందరమూ కలిసి ముందడుగు వేద్దామని కోరారు. కేంద్ర ప్రభుత్వ నిరంకుశ విధానాలను ఎండగట్టి ఇంటికి సాగనంపుదామని తెలిపారు. రాజ్యాంగ విలువలను కాపాడుకుందామని కోరారు. ఈనెల 30న జరిగే సభకు సిపిఐ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు రామచంద్రయ్య, సిపిఎం రాష్ట్ర కార్యదర్శి వర్గసభ్యులు వెంకటేశ్వర్లు, సిపిఐ జిల్లా కార్యదర్శి గిడ్డయ్య, అజరు బాబు, సిపిఎం జిల్లా కార్యదర్శి వర్గసభ్యులు పిఎస్‌.రాధాకృష్ణ, వెంకటేశులు హాజరవుతారని తెలిపారు. సిపిఎం నాయకులు గోపాల్‌, సిపిఐ నాయకులు అంజిత్‌ గౌడ్‌, రమేష్‌ పాల్గొన్నారు.