ప్రజాశక్తి - వేటపాలెం
ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమాన్ని నూరుశాతం అమలు జరిగే విధంగా కృషి చేస్తానని ఎంపీడీఒ కె నేతాజీ అన్నారు. ఇన్చార్జి ఎంపీడీఒగా శుక్రవారం బాధ్యతలు స్వీకరించారు. రెగ్యులర్ ఎంపీడీఒ రూతమ్మ సెలవు పెట్టడంతో జెడ్‌పి సీఈఒ జాలిరెడ్డి ఆదేశాల మేరకు చార్జి తీసుకున్నట్లు తెలిపారు. మండలంలో ఎలాంటి సమస్యలున్న సంక్షేమ కార్యక్రమాల గురించి ప్రజలు తనతో నేరుగా మాట్లాడొచ్చని అన్నారు. ఈనెల 27నుండి ప్రారంభం కానున్న కుల గణన కార్యక్రమానికి ముందస్తుగా సచివాలయ సిబ్బంది, వాలంటీర్లకు సూచనలు, అవగాహన కల్పిస్తామని అన్నారు. తొలుత నేతాజీకి మండల పరిషత్ సిబ్బంది మర్యాదపూర్వకంగా పుష్ప గుచ్చాన్ని అందించారు. కార్యక్రమంలో యుడిసి జయరాజ్, జూనియర్ అసిస్టెంట్ నాన్సీ సౌజన్య, టైపిస్టు లీలకుమారి, కంప్యూటర్ అనిల్ కుమార్ పాల్గొన్నారు.