Sep 09,2023 19:19

ప్రజాశక్తి - నూజివీడు రూరల్‌
    నూజివీడు ట్రిపుల్‌ ఐటీలో ఎంఎంఇ బ్రాంచ్‌ ఆఖరి సంవత్సరం విద్యార్థులు 10 మంది ఇంటర్న్‌షిప్‌కు ఎంపికైనట్లు ట్రిపుల్‌ ఐటీ ఛైర్మన్‌ ఆచార్య జివిఆర్‌ శ్రీనివాస్‌రావు శనివారం తెలిపారు. వీరందరూ కాకినాడలోని శ్రీభవాని కాస్టింగ్‌ లిమిటెడ్‌లో సంవత్సరం పాటు ఇంటర్న్‌షిప్‌ చేస్తారన్నారు. ఆ కాలంలో కంపెనీ వారికి నెలకు ఒక్కొక్కరికి రూ.10 వేలు స్టైఫెండ్‌ చెల్లిస్తుందన్నారు. ఎంపికైన వారిని డైరెక్టర్‌ ఎఒ ప్రదీప్‌, బోధనా సిబ్బంది, తోటి విద్యార్థులు అభినందించారు.