ఇంటర్ విద్యార్థులకు స్టడీ మెటీరియల్ అందిస్తున్న వడ్డవల్లి వీరనారాయణ
ప్రజాశక్తి-పంగులూరు: గత సంవత్సరం కొత్తగా ఏర్పడిన అద్దంకి మండలం తిమ్మాయపాలెం, పంగులూరు మండలం బూదవాడ గ్రామాల్లోనీ ఇంటర్ కళాశాలలో రెండో సంవత్సరం చదువుతున్న విద్యార్థులకు, అజిత్ కుమార్ చారిటబుల్ ట్రస్టు ఆధ్వర్యంలో, ట్రస్ట్ చైర్మన్ వడ్డేపల్లి వీరనారాయణ ఉచితంగా స్టడీ మెటీరియల్ అందజేశారు. ఆర్జెడి విఎస్ సుబ్బారావు కోరిక మేరకు ఈ రెండు కళాశాలల్లో చదువుతున్న విద్యార్థులకు స్టడీ మెటీరియల్ ఉచితంగా పంపిణీ చేశామని చెప్పారు. 22 వేల రూపాయల ఖరీదైన ఈ మెటీరియల్‌ను ఉపయోగించుకొని విద్యార్థులు చక్కగా చదువుకోవాలని, మంచి ఫలితాలు సాధించాలని వీరనారాయణ కోరారు.










