ఇంటర్ విద్యార్థులకు పాఠ్యపుస్తకాలు ఇవ్వాలి
ఇంటర్లో ఖాళీ పోస్టులు భర్తీ చేయాలి
ఎస్ఎఫ్ఐ నేతలు
ఎస్ఎఫ్ఐ 8 గంటల నిరాహార దీక్ష
ప్రజాశక్తి - నంద్యాల కలెక్టరేట్
ప్రభుత్వ జూనియర్ కళాశాల విద్యార్థులకు రాష్ట్ర ప్రభుత్వం పాఠ్యపుస్తకాలు అందించాలని ఎస్ ఎఫ్ ఐ జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు డక్క కుమార్, నిరంజన్ లు డిమాండ్ చేశారు. సోమవారం భారత విద్యార్థి ఫెడరేషన్ ఎస్ఎఫ్ఐ నంద్యాల జిల్లా కమిటీ ఆధ్వర్యంలో జిల్లా కలెక్టర్ కార్యాలయం వద్ద ప్రభుత్వ జూనియర్ కళాశాల విద్యార్థులకు రాష్ట్ర ప్రభుత్వం ఉచితంగా పాఠ్యపుస్తకాల అందించాలని, ఖాళీగా ఉన్న మూడువేల అధ్యాపక పోస్టులు భర్తీ చేయాలని, మధ్యాహ్న భోజన పథకం అమలు చేయాలని కోరుతూ 50 మందితో 8గంటల నిరాహార దీక్ష నిర్వహించారు.ఈ సందర్భంగా ఎస్ఎఫ్ఐ నంద్యాల జిల్లా అధ్యక్ష కార్యదర్శులు, డక్క కుమార్, నిరంజన్ మాట్లాడుతూ వైసిపి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రభుత్వ విద్యారంగం నిర్వీర్యం అవుతుందని ఆవేదన వ్యక్తం చేశారు. ఓవైపు విద్యారంగానికి అధిక నిధులు కేటాయిస్తున్నామని విద్యారంగా అభివృద్ధికి వైసిపి తప్ప ఏ పార్టీ కృషి చేయలేదని గొప్పలు మాత్రమే చెప్పుకుంటుందన్నారు . రాష్ట్ర విద్యాశాఖ మంత్రి ప్రభుత్వ జూనియర్ కళాశాలలో చదివి విద్యార్థులకు పాఠ్యపుస్తకాలు అందించలేమని నీసిగ్గుగా ప్రకటించడం దుర్మార్గమైన చర్య. గత సంవత్సరం విద్యార్థులకు పాఠ్యపుస్తకాలు అందించగా ఖాళీగా ఉన్న అధ్యాపక పోస్టులు భర్తీ చేయక అనేకమంది విద్యార్థులు పరీక్షలలో ఫెయిల్ కావడానికి ముఖ్య కారణమని తెలిపారు. అదేవిధంగా రాష్ట్ర బడ్జెట్లో 30% నిధులు విద్యారంగానికి ప్రకటించకపోవడం వల్లే ఈరోజు రాష్ట్రంలో ప్రభుత్వ విద్యా రంగం నిర్వీర్యం అవుతుందని పేర్కొన్నారు. ప్రభుత్వ మా అధికారంలోకి వచ్చి దాదాపు నాలుగున్నర సంవత్సరాలు కావొస్తున్న ఇప్పటికే ఖాళీగా ఉన్న ఉపాధ్యాయ అధ్యాపక పోస్టులు భర్తీ చేయకపోవడం దుర్మార్గమైన చర్యగా భావిస్తున్నామన్నారు. గతంలో ఇంటర్ విద్యార్థులకు అందించే మధ్యాహ్న భోజన పథకాన్ని రద్దు చేయడం వల్ల ప్రభుత్వ జూనియర్ కళాశాలలో చదివే విద్యార్థుల సంఖ్య తగ్గిందని తెలియజేశారు. రాష్ట్ర ప్రభుత్వం స్పందించి వెంటనే ప్రతి జూనియర్ కళాశాలలో చదివే విద్యార్థులకు రాష్ట్ర ప్రభుత్వం కచ్చితంగా పాఠ్యపుస్తకాల అందించాలని. ఖాళీగా ఉన్న 3వేల అధ్యాపక పోస్టులు భర్తీ చేయాలని, ప్రభుత్వ జూనియర్ కళాశాలలో చదివే విద్యార్థులకు మధ్యాహ్న భోజన పథకాన్ని అమలు చేయాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో ఎస్ఎఫ్ఐ జిల్లా సహాయ కార్యదర్శులు మధు కిరణ్, ప్రతాప్, జిల్లా నాయకులు రమేష్, సిద్ధార్థ, కార్తీక్, విద్యార్థులు అబ్దుల్ ఖాదర్, లోకేష్,చరణ్,రంగస్వామి, మద్దిలేటి, సాయి, చంద్రశేఖర్, అశోక్ తదితరులు పాల్గొన్నారు.










