ప్రజాశక్తి -కొత్తకోట:రావికమతం మండలం కొత్తకోట ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ఫేర్‌వెల్ వేడుకలు గురువారం ఘనంగా నిర్వహించారు. ఇంటర్ ద్వితీయ ఏడాది విద్యార్థులకు ఘనంగా వీడ్కోలు చెప్పేందుకు ఏర్పాటు చేసిన ఈ కార్యక్రమంలో కొత్తకోట, దొండపూడి, టి.అర్జాపురం, మేడివాడ, రావికమతం తదితర జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల, ప్రాథమిక పాఠశాలలకు చెందిన ప్రధానోపాధ్యాయులు పాల్గొన్నారు. ఈ సందర్బంగా విద్యార్థులు నిర్వహించిన పలు సాంస్కతిక కార్యక్రమాలు ఆహుతులను ఆకర్షించాయి. అనంతరం ప్రత్యేక ఆహ్వానితులకు కళాశాల ప్రిన్సిపాల్ సాయికుమార్, అధ్యాపక బృందం మెమొంటోలను అందజేశారు. విద్యార్థులకు ప్రోత్సాహక బహుమతులు అందించారు. ఈ కార్యక్రమంలో కళాశాల అభివృద్ధి కమిటి చైర్మన్ మంజీటి రాము, పలువురు అధ్యాపకులు, విద్యార్థులు, తల్లిదండ్రులు పాల్గొన్నారు.










