ప్రజాశక్తి - ఆదోని
రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసిన ఇంటర్ ఫలితాల్లో నోబుల్ ఒకేషనల్ జూనియర్ కళాశాల విద్యార్థులు జిల్లాలో మొదటి స్థానంలో నిలిచి ప్రభంజనం సృష్టించారని కరస్పాండెంట్ సంకటి దేవదానం తెలిపారు. గురువారం పట్టణంలోని కళాశాలలో ఏర్పాటు చేసిన అభినందన సభలో ఆయన మాట్లాడారు. ద్వితీయ సంవత్సరం మెడికల్ ల్యాబ్ టెక్నీషియన్‌లో హెచ్.ఇసాక్ 932/1000, సి.అఖిల్ 925/1000, డి.కార్తీక్ 925/1000, ఎంపి.రంగస్వామి 900/1000, నర్సింగ్‌లో బి.శ్రావణి 925/1000, బిడి.అనిత 913/1000, ఎం.స్ఫూర్తి 908/1000, ఫిజియోథెరపీలో ఎం.మాధవి లత 890/1000, ఎం.వినరు కుమార్ 803/1000 మార్కులు సాధించారన్నారు. అలాగే ప్రథమ సంవత్సరం మెడికల్ ల్యాబ్ టెక్నీషియన్‌లో కెఎం.బిందు 483/500, టి.అంజలి ప్రియ 454/500, వి.మేఘన 450/500, హెచ్.తబ్సం 447/500, నర్సింగ్‌లో, జి.చిన్నారి 447/500, యు.సుజాత 438/500, సమీరా భాను 437/500, కె.నజ్రీర్ భాను 437/500, ఫిజియోథెరపీలో బి.ధరణి 427/500, పి.చందన 405/500, మార్కులు సాధించారని తెలిపారు. జిల్లా మొదటి స్థానంలో నిలిపేందుకు కృషి చేసిన కళాశాల సిబ్బందికి, సహకరించిన విద్యార్థులకు, తల్లిదండ్రులకు అభినందనలు తెలిపారు. కళాశాల ప్రిన్సిపల్ అబ్దుల్ బాష, అధ్యాపకులు మొనా పరమగీతం, డాక్టర్ సలోమి, డాక్టర్ ఖాలిక్, రాజా రంగా, వీరేష్, ఎఒ బి.దినకర్, ఎస్.సౌజన్య, విజయ కుమారి పాల్గొన్నారు.
విజయకేతనం చూపిన నోబుల్ ఒకేషనల్ కళాశాల విద్యార్థులు










